టాలీవుడ్ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌. 2015లో వ‌చ్చిన ఈ సూప‌ర్ హిట్ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌కు ఊపిరిలూదింది. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న ఎన్టీఆర్ టెంప‌ర్ త‌ర్వాత ట్రాక్‌లోకి వ‌చ్చాడు. టెంప‌ర్ హిట్ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్‌ను ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌జెంట్ చేసిన తీరు చాలా మందిని ఫిదా చేసింది. 

ప‌ర‌మేశ్వర ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బండ్ల గ‌ణేష్ నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ రీమేక్ అయ్యింది. ఇక ఈ సినిమా వ‌చ్చిన నాలుగేళ్ల‌కు ఇప్పుడు టెంప‌ర్ కాపీ ఆరోప‌ణ‌ల్లో చిక్కుకుంది.  తాజాగా విశాల్ హీరోగా టెంప‌ర్ త‌మిళ్ రీమేక్ అయోగ్య వ‌చ్చి సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాలో విలన్‌గా నటించిన పార్తీబన్‌, టెంపర్‌ తన సినిమాకు కాపీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 1993లో తాను తెరకెక్కించిన ఉల్లే వెలియే సినిమా స్టోరీ ఆధారంగానే టెంప‌ర్ క‌థ రాసుకున్నార‌ని ఆరోపించారు. అయితే ఈ కాపీపై ఇప్పుడు తాను ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు. ఇక పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు వ‌క్కంతం వంశీ క‌థ అందించారు. మ‌రి ఈ కాపీ ఆరోప‌ణ‌ల‌పై వంశీ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో ?  చూడాలి. 

ఇక ఈ సినిమా త‌మిళ్ రీమేక్ విశాల్ హీరోగా అయోగ్య పేరుతో వ‌చ్చి సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విశాల్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రావ‌డంతో దీనిని విశాల్ ఇక్క‌డ డ‌బ్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: