సూప‌ర్‌స్టార్ మహర్షి దూసుకుపోతోంది. కేవ‌లం నాలుగు రోజుల‌కే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్‌తో మ‌రోసారి మ‌హేష్ బాక్సాఫీస్ స్టామినా ఫ్రూవ్ చేసింది. తొలి వారం ముగిసే స‌రికి మ‌హ‌ర్షి ఇంకెన్ని రాకార్డులు బ్రేక్ చేస్తుందో ?  షేక్ చేస్తుందో ?  చూడాలి. ఇక మ‌హ‌ర్షికి వ‌స్తోన్న టాక్‌తో ప్రిన్స్ ఆనందం ప‌ట్ట‌లేక‌పోతున్నాడు. వ‌రుస‌గా స‌క్సెస్ మీట్లు, ప్ర‌మోష‌న్లు, ఇంట‌ర్వ్యూలు, ఇటు పార్టీలు, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో మామూలుగా ఎంజాయ్ చేయ‌డం లేదు.

అటు న‌మ్ర‌త కూడా మ‌హ‌ర్షి స‌క్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఎంజాయ్‌మెంట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో కూడా షేర్ చేస్తుండ‌డంతో సినిమాకు మ‌రింత హైప్ వ‌స్తోంది. ఇక మ‌హ‌ర్షి మ‌హేష్ కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుందో ?  లేదో ?  తెలియ‌క‌పోయినా మ‌హేష్ న‌మ్మ‌కం మాత్రం అలాగే క‌నిపిస్తోంది. ఇక మ‌హేష్ ఎమోష‌న్లు కూడా ఫీక్‌గా ఉన్నాయి. ఇప్ప‌టికే కాల‌ర్ ఎగ‌రేయ‌డం, ద‌ర్శ‌కుడు వంశీని  ముద్దుపెట్టుకోవ‌డం లాంటి స్టిల్స్ బ‌య‌ట‌కు రావ‌డంతో వీటిపై బాగా చ‌ర్చ జ‌ర‌గ‌డంతో పాటు ఇవి క్లాస్ ఆడియెన్స్‌లో సినిమా త‌ప్ప‌కుండా చూడాల‌న్న ఫిలింగ్ క్రియేట్ చేశాయి.

ఇక ఇప్పుడు మ‌రో పిక్ బాగా వైర‌ల్ అవుతోంది. మ‌హేష్ త‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌తో పాటు ఆమె సిస్ట‌ర్ శిల్పా శిరోద్క‌ర్‌తో క‌లిసి ముగ్గురూ మ‌హ‌ర్షి విజ‌యానందం ప‌ట్ట‌లేక ఒక‌రిపై ఒక‌రు కింద‌ప‌డి పెన‌వేసుకున్నారు. ఇప్పుడు ఈ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక శిల్పా శిరోద్క‌ర్ ఒక‌ప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌. శిల్పా తెలుగులో కూడా మోహ‌న్‌బాబు బ్ర‌హ్మ సినిమాలో న‌టించింది. సినిమాలు మానేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న శిల్ప ఫేస్ ఇప్పుడు ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొత్తానికి మ‌హ‌ర్షి స‌క్సెస్‌ను మ‌హేష్ ఫ్యామిలీ మామూలుగా ఎంజాయ్ చేయ‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: