ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ  మ‌ల్టీస్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం. ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టి అనుష్కశెట్టి ఓ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం ఇది నిజం కాదని, ఈ చిత్రంలో ఆమె నటించడం లేదని చిత్రం యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
సైజ్ జీరో’ తదితర సినిమాల్లో పాత్రల కోసం కాస్త బొద్దుగా మారిన అనుష్క కష్టపడి బరువు తగ్గింది. చాలా రోజుల తర్వాత నయా లుక్‌తో అభిమానులకు దర్శనమిచ్చింది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత గత ఏడాది అనుష్క ‘భాగమతి’తో ఆకట్టుకున్నారు. దీని తర్వాత ట్రీట్‌మెంట్‌ కోసం అనుష్క అమెరికా వెళ్లి వచ్చినట్టు వార్తలొచ్చాయి. 
మార్చి నెలలో ప్రారంభ‌మైన కొత్త ప్రాజెక్టుకు హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ చిత్రానికి ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జ‌రుగుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: