చిరంజీవి అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ‘సైరా’  షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్తయిన నేపధ్యంలో ఈ మూవీని అక్టోబర్ 2న  విడుదల చేయాలి అన్న టార్గెట్ తో ఈమూవీకి సంబంధించిన పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇటీవల కోకాపేట పరిసరాల్లో చిరంజీవి ఫామ్ హౌస్ లో ‘సైరా’ కోసం నిర్మించిన భారీ సెట్ అగ్ని ప్రమాదంలో ఆహుతి కావడంతో ఈమూవీకి సంబంధించిన ఒక పాటని అన్నపూర్ణ స్టూడియోలో తీయడానికి ఒక భారీ సెట్ నిర్మాణం చేస్తున్నారు.

సుమారు రెండు కోట్ల భారీ ఖర్చుతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సెట్ కోసం పాత ‘బిగ్ బాస్’ సెట్ ను రీమోడల్ చేస్తున్నారు. అలా చేస్తూ ఉంటేనే 2కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన తారాగణం అంతా ఈ సెట్ లో చిత్రీకరించే పాట షూటింగ్ లో పాల్గోనబోతున్నట్లు టాక్.

ఇప్పటికే  ఈ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సెట్ కు సంబంధించి లైటింగ్ ఏ విధంగా కావాలి ఈ పాటను ఎలా చిత్రీకరించాలి అన్న ఇషయమై ఈమూవీ కొరియోగ్రాఫర్లతో చర్చచిస్తున్నట్లు సమాచారం. ఈ పాట  ఈమూవీకి హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సెట్ డిజైన్ చూసిన వారికి చార్మినార్ గుర్తుకు వచ్చేలా నాలుగు స్థంబాలతో సెట్ వేసినట్లు తెలుస్తోంది.  

పూర్తిగా విజువల్ గ్రాండియర్ ఈ సెట్ లో అణువణువునా కనిపించే విధంగా ఈ సెట్ ను ప్రస్తుతం అనేక మంది వర్కర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సెట్ పూర్తి అయిన వెంటనే మరో 10 రోజులలోపే ఈ సెట్ లో ఈ కీలక పాటను చిత్రీకరించడంతో ఇంచుమించు ‘సైరా’ షూటింగ్ పూర్తి అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: