చిరంజీవి పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ వార్తల లీకులు వచ్చి ఒకరోజు పూర్తి కాకుండానే ఆవిషయం పై మీడియాలోని కొన్ని వర్గాలు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసిన నెగిటివ్ కామెంట్స్ కు చరణ్ తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ విధ్యా సంస్థలను ప్రారంభించడం వెనుక కోట్ల సంపాదనకై మెగా స్కెచ్ ఉంది అంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలు చరణ్ కు తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ విషయాలు అన్నీ చరణ్ దృష్టి వరకు వెళ్ళడంతో చరణ్ తీవ్ర అసహనానికి లోను కావడమే కాకుండా తాము విధ్యా సంస్థల ద్వారా వ్యాపారం చేయాలి అనుకుంటే వెనుకపడిన జిల్లా శ్రీకాకుళంలో విధ్యా సంస్థలు ఎందుకు పెడతాము అంటూ చరణ్ తనను కలిసిన సన్నిహితులతో అన్నట్లు టాక్. విధ్యా సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా కోట్లు గణించాలీ అంటే హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ లాంటి ప్రముఖ నగరాలలో పెట్టేవాళ్ళము అంటూ తమ ఫ్యామిలీ పై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఈ స్కూల్ నిర్వాహణలో తమ కుటుంబ ఆదిపత్యం ఏమీ ఉండదనీ కేవలం లాభాపేక్ష లేకుండా సేవా భావంతో తాము చేస్తున్న పనులకు ఆర్ధిక కారణాలు జోడించి తమ పై బురద జల్లడం ఎంత వరకు సమంజసం అన్న అభిప్రాయంలో చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తాము కోట్లల్లో లాభాలు చేసుకోవాలి అంటే స్కూల్స్ కాలేజీలు పెడితే రావనీ కేవలం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు సేవ ఉద్దేశ్యంతో ఏర్పాటు చేస్తున్న విధ్యా సంస్థల విషయాన్ని కూడా వ్యాపార దృష్టితో రాజకీయం చేయడం తనకు షాక్ ఇస్తోంది అని చరణ్ తన సన్నిహితులతో అన్నట్లు లీకులు వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం స్కూల్స్ కాలేజీలు స్థాపించడం కూడ ఒక వ్యాపారంగా మారిపోయిన పరిస్థుతులలో మెగా ఫ్యామిలీ ఇలాంటి వ్యాపార పోకడలకు దూరం అన్న సంకేతాలు ఇస్తున్నా నాణ్యమైన విద్యను పేదలకు అందుబాటులోకి తేవాలి అంటే మెగా కుటుంబం చాల త్యాగాలు చేయవలసిన పరిస్థితి. మరి అటువంటి త్యాగాలు మెగా ఫ్యామిలీ ఎంతవరకు చేస్తుంది అన్న విషయం రానున్న రోజులలో తేలిపోతుంది..  
  


మరింత సమాచారం తెలుసుకోండి: