బుల్లితెర క్రేజీ జోడీ సుధీర్ రష్మిల గురించి అందరికి తెలిసిందే. షో ఏదైనా సరే రష్మి ప్రేమ కోసం సుధీర్ తెగ తాపత్రయ పడతాడు. జబర్దస్త్ నుండి ఢీ షో వరకు వీరి జంట ఆడియెన్స్ ను బాగా ఎంటర్టైనర్ చేస్తుంది. అయితే అసలు సుధీర్, రష్మిల మధ్య ఏముంది.. వారిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనా వారి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదా అంటే అడిగిన ప్రతిసారి మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెబుతుంటారు.


షో రేటింగ్ పెంచేందుకు వీరిద్దరికి ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకునేలా ఢీలో ఇద్దరితో డ్యాన్సులు.. ఇద్దరి మధ్య ప్రపోజల్స్ ఇలా ప్లాన్ చేస్తుంటారు. అయితే తానో హీరో మెటీరియల్ అని చెబుతూ వస్తున్న సుధీర్ నిజంగానే హీరోగా ఎంట్రీ ఇస్తాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. జబర్దస్త్, ఢీ షోలతో మంచి ఇమేజ్ సాధించిన సుధీర్ హీరోగా టర్న్ తీసుకోవాలని చూస్తున్నాడు.


సుధీర్ హీరో అయితే రష్మి హీరోయిన్ గా చేస్తుందా అంటే.. యాంకర్ గా చేస్తూనే రొమాంటిక్ సినిమాల్లో నటిస్తుంది రష్మి. అయితే హీరోగా సుధీర్ చేసినా హీరోయిన్ గా రష్మి మాత్రం ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు. సుధీర్ రష్మిల జోడీ బాగుంటుంది కాబట్టి అలాంటి కథ ఏదైనా వస్తే ఇద్దరు కలిసి నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


మొత్తానికి సుధీర్, రష్మిల కెమిస్ట్రీపై హాట్ న్యూస్ రన్ అవుతుంది. ప్రతి బుధవారం ఢీ షోలో.. శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుధీర్ రష్మిల కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుంది. మరి ఇద్దరు తర్వాత కెరియర్ ఎలా ఉంటుందో తెలియదు కాని యూట్యూబ్ జోడీగా వీరు మాత్రం బాగా పాపులర్ అయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: