ఆర్.ఎక్స్.100 సినిమాతో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ ఎవరికి వారు స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఇద్దరు కాస్త ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉన్నారు. పాయల్ విక్టరీ వెంకటేష్ తో 'వెంకీ మామ', మాస్ మహా రాజ రవితేజ తో 'డిస్కో రాజా'లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ అగర్వాల్ జంటగా వస్తున్న 'సీత' సినిమాలోను ఒక అదిరిపోయే ఐటం సాంగ్ చేసింది. ఇక కార్తికేయ కూడా పెద్ద బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నాడు.


అందులో ఒకటి టి.ఎన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న 'హిప్పీ'. ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నాడు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హీరోగా కార్తికేయ యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరగడం ఖాయమంటున్నారు చిత్ర బృందం. రీసెంట్‌గా రిలీజైన థియోట్రికల్ ట్రైలర్, టీజర్ తో కూడా ఈ సినిమా గ్యారెంటీ హిట్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతలా ఈ సినిమా హైప్ ని క్రియోట్ చేస్తోంది.  


ఇక జే.డీ చక్రవర్తి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను జూన్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అప్పటివరకూ ఈ సినిమాకు ఇంకా హైరేంజ్ లో హైప్ క్రియోట్ చేయడానికి ఈ సినిమాలోని లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: