ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు జీవిత చరిత్రలను వీక్షించడానికి బాగా ఆసక్తి కనబర్చుతున్నారు. సినీ వర్గాల వారు కూడా బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు రంగాలో గల ప్రముఖుల జీవిత చరిత్రలను తెరపై చూపించారు కొందరు దర్శక నిర్మాతలు. బయోపిక్ లకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లేకపోయినా కొంత మంది దర్శకులు తమకున్న అభ్యుదయ భావాల చేత యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చె విధంగా బయోపిక్ లను తెరకేక్కిస్తున్నారు
ఇంకా చాలామంది బయోపిక్‌లను కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

తాజాగా మరో ఆసక్తికర బయోపిక్‌ రానుంది అనే వార్త ప్రచారం జరుగుతోంది. నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతు భారత రాష్ట్రపతి స్థానాన్ని సంపాదించుకున్న, యువత రోల్‌ మోడల్‌ భారతరత్న అవార్డు గ్రహీత, భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్‌కలాం జీవితం ఆధారంగా ఓ సినిమా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


ఈ జీవిత చరిత్రను మొదటగా ఇంగ్లీషులో తెరకెక్కించి ఆ తర్వాత పలు భాషల్లో డబ్‌ చేయనున్నారట. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. కలాంగారి బాల్యం నుండి ఎదుర్కోన్న పరిస్థితులు ఆ తర్వాత శాస్త్రవేత్త, రాష్ట్రపతి ఇలా ఆయన జీవితం మొత్తాన్ని తెరపై చూపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని నిర్మాత అనిల్‌ సుంకర ప్రకటించారు. 


మొత్తానికి ఇలాంటి జీవిత చరిత్రలను తెరపై చూపించి యువత మార్గదర్శకం చూపించాలి అని చేసే ఈ ఆలోచనలు చాలా బాగున్నాయి. అయితే ఈ చిత్రం తెరకెక్కడానికి ఇంకా సమయం చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. డ్రీమ్‌ మర్చెంట్స్‌ ఐఎన్‌సీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఎకేఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: