అమ్మాయంటే ఇలా వుండాలి.  ఇలాంటి వ్య‌క్తితోనే స‌హ‌జీవ‌నం సాగించాల‌నే ఫీలింగ్స్‌ను క‌లిగించేలా త‌నను తాను న‌టిగా ప్రూవ్ చేసుకుంది క‌ర్ణాట‌క‌కు చెందిన ర‌ష్మికా మందాన‌. అంత‌కు ముందు క‌న్న‌డ‌, తెలుగు సినిమాల్లో న‌టించినా పెద్ద‌గా స్కోప్ రాలేదు. కానీ విజ‌య దేవ‌ర‌కొండతో క‌లిసి న‌టించిన గీత గోవిందం మూవీ వ‌చ్చాక‌..ప్ర‌తి తెలుగు కుటుంబంలో మ‌నింటి అమ్మాయే అనుకునేంత‌లా క‌నెక్ట్ అయ్యింది. అలా అన‌డం కంటే ద‌ర్శ‌కుడు ఆ పాత్ర‌ను అలా మ‌లిచాడు. స‌ర‌దాగా సాగుతూనే ఉదాత్త‌మైన ప్రేమ‌కు గొప్ప‌నైన ముగింపు ఇచ్చాడు ఈ మూవీలో. ర‌ష్మికా చాలా ఈజీగా ఎక్క‌డా తొట్రుపాటుకు లోన‌వ‌కుండా పాత్ర‌కు న్యాయం చేసింది. సంగీతం, డైలాగ్స్ , క‌థ అన్నింటికంటే పాత్ర‌లు జ‌నాన్ని థియేట‌ర్ల‌లోకి ర‌ప్పించేలా చేశాయి. ఒక‌ప్పుడు తెలుగు సినిమాలు హీరోల చుట్టూ తిరిగేవి. ఇపుడు సీన్ మారింది. అగ్ర హీరోలు క‌థ‌ల చుట్టూ తిరుగుతున్నారు. 


క‌ర్ణాట‌క‌లోని ఓ మారుమూలన 5 ఏప్రిల్ 1996లో జ‌న్మించారు ర‌ష్మికా. మోడ‌ల్‌గా, న‌టిగా క‌న్న‌డ‌, తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు. 2016లో విడుద‌లైన త‌ను న‌టించిన కిరిక్ పార్టీ సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ సినిమాగా నిలిచింది. దీంతో సౌత్ ఇండియాలోనే ఒక్క‌సారిగా స్టార్ డ‌మ్ తెచ్చుకున్నారు. బెంగ‌ళూరు టైమ్స్ ప‌త్రిక‌..2017లో మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ పేరుతో 30 మందితో జాబితా విడుద‌ల చేసింది. అందులో టాప్‌లో మందాన నిలిచారు. 100 కోట్ల క్ల‌బ్‌లో త‌క్కువ స‌మ‌యంలో చేరిపోయారు. రొమాంటిక్ సినిమాగా 2018లో తెర‌కెక్కిన చ‌లో సినిమాలో మొద‌టిసారిగా న‌టించారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. అదే ఏడాది విడుద‌లైన గీత గోవిందం ఆల్ టైం హిట్ సినిమాగా నిలిచింది. త‌క్కువ పెట్టుబ‌డితో తీసిన ఈ సినిమా ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. అంజ‌నీ పుత్ర‌, చ‌మ‌క్, య‌జమానా సినిమాల్లో న‌టించింది. 


మైసూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామ‌ర్స్‌లో ప్రీ యూనివ‌ర్శిటీ కోర్స్ చేసింది. సైకాల‌జీలో డిగ్రీ, జ‌ర్న‌లిజం అండ్ ఇంగ్లీష్ లిట‌రేచ‌ర్ లో ఎంఎస్ రామ‌య్య కాలేజీలో పూర్తి చేశారు. కొన్ని ప్ర‌క‌ట‌న‌ల్లో మోడ‌ల్‌గా న‌టించారు. ర‌క్షిత్ శెట్టి యాక్ట‌ర్‌తో 3 జూలై 2017లో ఎంగేజ్ మెంట్ అయింది. సెప్టెంబ‌ర్ 2018లో చేసుకోవ‌డం లేదంటూ ప్ర‌క‌టించారు. 2012 నుండి ర‌ష్మికా మోడ‌లింగ్ స్టార్ట్ చేశారు. క్లీన్ అండ్ క్లియ‌ర్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నారు. 2013లో టీవీసీ టాప్ మోడ‌ల్ హంట్‌గా నిలిచారు. 19 ఏళ్ల వ‌య‌సులోనే షార్ట్ ఫిలిం ద్వారా త‌న కెరీర్ ప్రారంభించారు. కిరిక్ పార్టీ సినిమాలో న‌టించ‌డంతో ఒక్క‌సారిగా ర‌ష్మికా వెలుగులోకి వ‌చ్చారు. 50 కోట్లు క‌లెక్ట్ చేసింది ఆ సినిమా. 4 కోట్లు పెట్టి ఈ సినిమా తీశారు. క‌ర్ణాట‌క‌లోని మెయిన్ సెంట‌ర్ల‌లో 150 రోజులు ఆడింది ఈ సినిమా. షాన్వి పాత్ర‌లో ర‌ష్మిక అపూర్వ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. సిమా అవార్డును ద‌క్కించుకున్నారు. 


2017లో హ‌ర్ష‌తో క‌లిసి అంజ‌నీ పుత్ర లో న‌టించారు. ఇది క‌మ‌ర్షియ‌ల్‌గా బాక్సాఫిస్ సాధించింది. ఆ త‌ర్వాత చ‌మ‌క్ క‌న్న‌డ మూవీలో న‌టించారు. అనంత‌రం తెలుగు సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు. నాగ శౌర్య‌తో క‌లిసి న‌టించిన ఈ మూవీ అన్ని చోట్లా అద్భుత‌మైన టాక్ తెచ్చుకుంది. భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ త‌ర్వాతి సినిమా గీత గోవిందం 130 కోట్లు రాబ‌ట్టింది. ఇందులో ప్ర‌ధాన పాత్ర ర‌ష్మిక మందాన‌దే. సో ఆ ఒక్క సినిమా హిట్‌తో ఆమె కెరీర్ రూప‌మే మారి పోయింది. అందంతో పాటు అభిన‌యం కూడా అల‌వ‌ర్చుకున్న ఈ సోగ‌క‌ళ్ల సుంద‌రి ఇపుడు సౌత్ ఇండియాలో టాప్ వ‌న్ హీరోయిన్‌గా ఉన్నారు. ప్రిన్స్ మ‌హేష్ బాబుతో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లో తీయ‌బోయే సినిమాకు సెలెక్ట్ అయింద‌ని స‌మాచారం. ఇదే క‌నుక క‌న్ ఫ‌ర్మ్ అయితే ర‌ష్మిక త‌క్కువ  టైంలోనే జాక్ పాట్ కొట్టేసిన‌ట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: