'పీ.ఎస్.వీ గరుడవేగ' సినిమాతో మళ్ళీ సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినీ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరిని ఆహ్వానించారు. తన సినిమా ట్రైలర్, టీజర్స్ ని చూపించి అందరి నుంచి అభినందనలు పొందారు. ఈ సినిమా హిట్ అవడంతో రాజశేఖర్ మళ్ళీ వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక పక్క 'మా' లో తన కర్తవ్యాన్ని నిర్వర్తిసూనే మరో పక్క తన కూతురిని హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసే పనిలో ఉన్నారు.


ఇక రీసెంట్‌గా రాజశేఖర్ కల్కీ అనే సినిమాలోను నటిస్తూ బిజి బిజీ గా ఉన్నారు. అంతేకాదు ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ కూడా సినిమా మీద అంచానాలు బాగా పెంచేస్తున్నాయి. మంచి ఫాం లో ఉన్న రాజశేఖర్ సూపర్ స్టార్ మహేష్ నటించిన 'మహర్షి' సినిమా చూసి ఆ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని ప్రేక్షకులకు తెలిపారు.


ఈ సినిమాలో మహేష్ అద్భుతంగా నటించారని, ఈ సినిమాలో రైతు  సమస్యల మీద తీసుకున్న సామాజిక అంశం ఎంతో బావుందని ఇలాంటి సినిమాలు మహేష్ లాంటి స్టార్ చేస్తేనే అందరూ ఆలోచిస్తారని, సమాజంలో కొన్ని మార్పులు వస్తాయని రాజశేఖర్ మహేష్ పట్ల, చిత్ర బృందం పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా విడుదలైన నాలుగురోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి అందరిని ఆశ్చర్య పరిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: