వేసవి కానుకగా వచ్చిన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన సక్సెస్ మీట్ లో పాల్గొంటున్న మహేష్బాబు తన తర్వాత సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం.

Image result for mahesh babu

ముఖ్యంగా ఈ సినిమాలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ తరహాలో స్టోరీ ఉండబోతున్నట్లు ..అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు కి అత్తగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించబోతున్నట్లు సమాచారం. వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు అవడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడట మహేష్ బాబు.

Related image

కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ సీన్స్ రాయటంలో అనిల్ మంచి సిద్ధహస్తుడు దీంతో అడవి టైమింగ్ కి మహేష్ కామెడీ టైమింగ్ కుదిరితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినబడుతున్నాయి. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: