బాహుబలి సీరీస్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.  రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలు.  మల్టీస్టారర్ గా  తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.  దీనికి కారణాలు ఏంటి... ఎందుకు ఆ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది.  



రాజమౌళికి ఇప్పటి వరకు ఫెయిల్ లేదు.  ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన వ్యక్తి రాజమౌళి.  హీరో ఎవరైనా కావొచ్చు... రాజమౌళి ఫాలో అయ్యే ఫార్ములా మాత్రం మారదు.   ఏ  ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారో ఎలాంటి మసాలా కావాలో వాటిని సినిమాలో దట్టిస్తారు.  చిన్న హీరో కావొచ్చు .. పెద్ద స్టార్ కావొచ్చు.. ఫార్ములా మాత్రం మారదు.  అందుకే రాజమౌళికి ఫెయిల్యూర్ రాలేదు.  


ఎన్టీఆర్... టెంపర్ తరువాత ఎన్టీఆర్ కు ఫెయిల్ లేదు.  వరసగా ఆరు సినిమాలు హిట్టయ్యాయి.  రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి.  రెండు బ్లాక్ బస్టర్ హిట్టే.  ఇది మూడో సినిమా.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.   పైగా రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న సినిమా కావడం సినిమాకు ప్లస్ పాయింట్.  


రామ్ చరణ్... రంగస్థలం ఇచ్చిన కిక్... కావొచ్చు... మగధీర తరువాత మరలా రాజమౌళి చేస్తుండటం కావొచ్చు లేదంటే ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ ను పంచుకోవడం కావొచ్చు.. సినిమాకు హైప్ తేవడంలో ఈ విషయాలు చాలా వరకు సహకరించాయి.  ఎన్టీఆర్ కు, రామ్ చరణ్ కు మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉంది.  ఇది సినిమాకు మరింత హైప్ ను తీసుకొచ్చింది.  


పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడం ఒకటైతే... ఇందులో అలియా భట్ హీరోయిన్ కావడం మరో విశేషం.  దీంతో పాటు చారిత్రాత్మక కథాంశంతో సినిమా తెరకెక్కడంతో అంచనాలు భారీగా పెరిగాయి.  జూన్ 20, 2020 న సినిమా రిలీజ్ కాబోతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: