మహర్షి’ జాతకం పూర్తిగా తెలియడంతో ఈమూవీ రికార్డుల విషయంలో చరిత్ర సృష్టిస్తుంది అన్న మహేష్ అభిమానుల అంచనాలు తారుమారు అయ్యాయి. దీనితో ఇప్పుడు వచ్చేనెల నుండి ప్రారంభం కాబోతున్న మహేష్ అనీల్ రావిపూడిల మూవీ ప్రాజెక్ట్ పై మహేష్ అభిమానుల అంచనాలు మొదలయ్యాయి. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తి అయిన నేపధ్యంలో ఈమూవీలో మహేష్ పాత్రకు సంబంధించి ఒక సెంటిమెంట్ గుర్తుకు వచ్చి అనీల్ రావిపూడి కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో మొదట్లో అనుకున్నట్లుగా మహేష్ పాత్ర పోలీసు పాత్ర కాదు అని తెలుస్తోంది. 

ఈసినిమా కథ అంతా గ్రామీణ నేపధ్యంలో ఉంటుందని అందువల్ల మహేష్ ను పోలీసు డ్రస్ లో చూపించడం కంటే వేరే లుక్ లో చూపించడానికి ప్రయత్నాలు మొదలైనట్లు టాక్. దీనికితోడు ‘ఆగడు’ సినిమాలో మహేష్ పోలీసు పాత్ర నవ్వులు తెప్పించినా కలక్షన్స్ విషయంలో ఫెయిల్ అయిన సెంటిమెంట్ వల్ల అనీల్ రావిపూడి తన సినిమాలో మహేష్ ను పోలీసు ఆఫీసర్ గా కాకుండా మరొక విధంగా చూపించబోతున్నట్లు సమాచారం. 

వాస్తవానికి అనిల్ తీసిన ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ప్యాట్రన్ ఒకేలా ఉండగా ‘ఎఫ్‌ 2’ లో కొత్త పద్ధతిని అనుసరించాడు. అదేవిధంగా మహేష్ సినిమా విషయంలో కూడ పూర్తి విభిన్నమైన లైన్ ను ఎంచుకుని అత్తగారిని ఒక ఆట ఆడించే హీరో పాత్రలో మహేష్ అవుట్ అండ్ అవుట్ కామెడీతో కనిపించబోతున్నాడని టాక్. దీనితో మహేష్ ఈసినిమాలో ఖాకీ చొక్కా వేసినా వేయకపోయినా కూడా కామెడీతో చుక్కలు చూపిస్తాడని అభిమానుల నమ్మకం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: