టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో సూపర్ ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో సెన్సేషనల్ హీరో అయ్యాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో మరోసారి రష్మిక మందన్నతో రొమాన్స్ చేస్తున్నాడు మన రౌడీ హీరో. ఈ సినిమా తర్వాత క్రాంతి కుమార్ డైరక్షన్ లో మూవీ వస్తుంది.


ఆ సినిమాలో కూడా ముద్దుల హంగామా ఉంటుందని తెలుస్తుంది. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ లో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తో విజయ్ క్లోజ్ గా ఉంటున్నాడని. త్వరలో ఆమెని పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై విజయ్ స్పందించలేదు కాని ఆ హీరోయిన్ మాత్రం ట్విట్టర్ ద్వారా రెస్పాన్స్ ఇచ్చింది.


తనౌ ఒక హీరోతో పెళ్లంటూ వార్తలు రాస్తున్నారు.. అతనెవరో తనకు చెబితే బాగుంటుంది. ప్రస్తుతం సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ నా లైఫ్ లో అలాంటిది ఏదైనా జరిగితే తప్పకుండా ముందు మీకే చెబుతా అంటూ ట్వీట్ చేసింది ఐశ్వర్య రాజేష్. ఆమె రెస్పాండ్ అయ్యింది అంటే ఈ వార్తలు ఏ రేంజ్ లో వెళ్లాయో అర్ధం చేసుకోవచ్చు. 


తను చేసే ప్రతి హీరోయిన్ తో విజయ్ కు ఇదో పెద్ద ప్రాబ్లెం వచ్చి పడుతుంది. ప్రస్తుతం విజయ్ రష్మికల మధ్య కూడా సంథింగ్ సంథింగ్ అన్న టాక్ వస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరిపై ఇలాంటి వార్తలు రావడం సహజం. మొత్తానికి విజయ్ దేవరకొండ టాలీవుడ్ రొమాంటిక్ హీరో అయ్యాడని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: