వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాధ్ కొత్త సినిమా రామ్ పోతినేని హీరోగా “ఇస్మార్ట్ శంకర్” అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం యూనిట్ లేటెస్ట్ గా ఒక టీజర్ ను విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే ఏది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. “నీయమ్మ అరేయ్”.. అంటూ మొదలైన టీజర్ ఒక కొత్త లుక్ తో హీరో రామ్ అందరిని ఆకట్టుకొన్నాడు.

 

టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుడా చాల బావుందని ప్రేక్షకులు అభిప్రాయం . ముఖ్యం గా హీరో రాం మందు బాటిల్ నోట్లో పెట్టుకుని వేసిన స్టెప్పు మొత్తం టీజర్ కే హైలైట్ అని చెప్పుకోవాలి. ఇటివలే గోవాలో ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. గ్రాండ్ స్కేల్ లో సెట్లు వేసి హంగామా చేస్తున్నారు పూరి టీం. ఇందులో పాటలు శేఖర్ మాస్టర్ తదితరులు కోరియోగ్రఫీ చేస్తున్నారు. రామ్ మంచి డాన్సర్ కావడంతో ఉత్సాహమైన, విబిన్నమైన స్టెప్పులతో పాటలు ఉండబోతున్నాయని వినికిడి.

 

హీరో రామ్ కి కుడా సరైన హిట్టులు లేవు “హలో గురు ప్రేమకోసమే” అనే సినిమా యావరేజు టాక్ వచ్చింది. అంతకు ముందు చేసిన “ఉన్నది ఒక్కటే జిందగీ” సినిమాతో ఓ మోస్తరు హిట్ లభించినా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించలేదు. ఇంక ఈ హీరో ఒక బ్లాక్ బస్టర్ లాంటి హిట్ కోసం వేచిచుస్తున్నాడు. నిజానికి పూరి కూడా అదే తరహలో ఒక మంచి టర్నింగ్ పాయింటు కోసం చూస్తున్నాడు. తిరిగి తన స్టార్ డైరెక్టర్ రేంజ్ సంపాదించుకోవాలి అని తపన పడుతున్నాడు.

 

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి ఆదరణ లభించి హీరో రామ్ చాల కొత్తగా కనపడుతున్నాడని ఆడియన్స్ టాక్. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభ నటాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్ బ్యానేర్స్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: