టాప్ హీరోల మధ్య పోటీ పెరిగిపోయి వారి పై నెగిటివ్ ప్రచారాల హడావిడి పెరిగిపోవడంతో ఈవిషయాలకు అడ్డుకట్ట వేయడానికి టాప్ హీరోలు అంతా లక్షలు ఖర్చుపెట్టి పిఆర్ టీమ్ లను కొనసాగించుకుంటున్నారు. వీరంతా తాము పనిచేస్తున్న హీరోలకు వీరధేయత వ్యక్త పరుస్తూ వారి హీరోల పై ఏమాత్రం నెగిటివ్ వార్తలు కనిపించినా వెంటనే వాటికి అడ్డుకట్ట వేస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ పిఆర్ టీమ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక ఛానల్ లో ప్రసారం అయిన నెగిటివ్ వార్తలకు చెక్ పెట్టిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బన్నీ తన భార్య పిల్లలతో స్విడ్జర్లాండ్ వెళ్లి అక్కడ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. 

ఈవార్తను ఒక ప్రముఖ ఛానల్ తన సినిమా న్యూస్ లో ప్రచారం చేస్తూ ఇండియాలో బన్నీ కోసం త్రివిక్రమ్ సుకుమార్ లు ఎదురు చూస్తుంటే ఆ విషయాలు ఏమీ పట్టించుకోకుండా అల్లు అర్జున్ బాధ్యతలు పక్కన పెట్టి సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఒక నెగిటివ్ వార్తను ప్రసారం చేసింది. ఈ వార్తకు ఎలర్ట్ అయిన బన్నీ పిఆర్ టీమ్ ఏకంగా ఆ ఛానల్ కు చాల తెలివిగా చెక్ పెట్టింది. 

ఇదే ఛానల్ కొద్ది రోజులక్రితం ప్రసారం చేసిన సినిమా న్యూస్ లో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిందని ఈమూవీ సెకండ్ షెడ్యూల్ జూన్ నెల నుండి ప్రారంభం అవుతుంది అని ప్రసారం చేసిన న్యూస్ ను గుర్తు చేస్తూ బన్నీ టీమ్ ఆ ఛానల్ కు ఊహించని షాక్ ఇచ్చింది. దీనితో బన్నీ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి బన్నీ పిఆర్ టీమ్ చాల తెలివిగా తిప్పి కొట్టింది అంటూ అల్లు అర్జున్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: