సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మహర్షి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు క‌ర్ణాట‌క‌, చెన్నై లాంటి చోట్ల కూడా దుమ్ము లేపే వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం మ‌హేష్‌బాబు స్టామినాకు నిద‌ర్శ‌నం. ఫ‌స్ట్ వీకెండ్‌లో దుమ్ము రేపిన మ‌హ‌ర్షి కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. సోమ‌వారం నుంచి క‌లెక్ష‌న్లు ఓ మోస్తరుగా డ్రాప్ అయినా ప‌ర్వాలేద‌నిపించే స్థాయిలోనే వ‌సూళ్లు ఉన్నాయి.

ఇండియ‌న్ స్క్రీన్ మీద దుమ్ము రేపుతోన్న మ‌హ‌ర్షి... మ‌హేష్‌కు కంచుకోట‌గా ఉన్న ఓవ‌ర్సీస్లో మాత్రం బొక్క బోల్తా ప‌డింది. ప్రీమియ‌ర్స్ నుంచే అక్క‌డ మ‌హ‌ర్షి దూకుడు క‌న‌ప‌డ‌లేదు. మ‌హేష్ సినిమాలు ఓవ‌ర్సీస్‌లో కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టాయి. ప్రీమియ‌ర్ల‌తో కేవ‌లం హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌తో స‌రిపెట్టిన మ‌హ‌ర్షి చాలా స్లోగా మిలియ‌న్ మార్క్ ట‌చ్ చేసింది.

ఇక మ‌హ‌ర్షి విడుదలైన మొదటి సోమవారం అంటే వీక్ డే లో కొల్లగొట్టిన కలెక్షన్స్ విషయంలో టాప్ 10 సినిమాల విష‌యంలో కేవ‌లం 9వ స్థానంతో స‌రిపెట్టుకుంది. గ‌తంలో స్పైడ‌ర్‌, బ్ర‌హ్మోత్స‌వం, ఆగ‌డు లాంటి డిజాస్ట‌ర్లే కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే మిలియ‌న్ మార్క్ ట‌చ్ చేశాయి. ఇప్పుడు సినిమాకు ఆ సినిమాల‌తో పోలిస్తే టాక్ బాగున్నా వ‌సూళ్లు త‌గ్గ‌డాన్ని బ‌ట్టి చూస్తే ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించే విష‌యంలో మ‌హేష్ మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంది. 

  1. రంగస్థలం – 110K
  2. భారత్ అనే నేను – 80K
  3. మహానటి – 66K
  4. ఎఫ్2 – 65K
  5. గీత గోవిందం – 50K
  6. జెర్సీ – 43K7.
  7. భాగమతి – 39K8.
  8. గూఢచారి – 32K9.
  9. మహర్షి – 30k10.
  10. అరవింద సమేత – 30K

మరింత సమాచారం తెలుసుకోండి: