తమ్మారెడ్డి భరద్వాజ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత తెలుగు సినిమా పరిస్థుతుల గురించి మాట్లాడుతూ మధ్యలో రాజమౌళి ప్రస్తావన తీసుకు వస్తూ చేసిన కామెంట్స్ దేనికి సంకేతం అన్న కోణంలో ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. టాప్ హీరోలు అందరికీ సమర్థత ఉన్నా ‘బాహుబలి’ లాంటి సినిమా చేయడానికి ఎందుకు ప్రయత్నించరు అంటూ భరద్వాజ ప్రశ్నలు వేస్తున్నాడు. 

అంతేకాదు ‘బాహుబలి’ ఒక మామూలు కథతో కూడిన సినిమా అనీ అయితే ఆ సినిమాను అందులో నటించే వారు అందరు నమ్మారు కాబట్టి ఆ రేంజ్ హిట్ వచ్చిందనీ అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇండస్ట్రీ పెరగాలి అంటే ‘బాహుబలి’ స్థాయిలో ఉండే సినిమాలు చాల రావాలి అనీ అలా కాకుండా కేవలం ఎప్పుడు ‘బాహుబలి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ కాలం గడిపితే గొప్ప సినిమాలు వస్తాయా అంటూ భరద్వాజ ఎదురుప్రశ్నలు వేయడం బట్టీ చివరకు అతడి ఆలోచనలు ఏమిటి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదే సందర్భంలో రాజమౌళి లాంటి సమర్ధులు ఇండస్ట్రీలో మరెవ్వరు లేరు అనడం సమంజసం కాదనీ వాస్తవానికి రాజమౌళి దేవుడా అంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. రాజమౌళి 5 ఏళ్ల పాటు హీరో హీరోయిన్‌ లను హోల్డ్‌లో  పెట్టుకున్నాడు కాబట్టి ‘బాహుబలి’ లాంటి విజయం వచ్చింది అని కొందరు చేస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ ప్రముఖ హీరోలు హీరోయిన్స్ అందరు రాజమౌళిని నమ్మినట్లు మిగతా దర్శకులను కూడ నమ్మితే ‘బాహుబలి’ లాంటి  చరిత్ర సృష్టించే సినిమాలు వస్తాయి అని అంటున్నారు భరద్వాజ. 

వాస్తవానికి భరద్వాజ చేసిన కామెంట్స్ లో కొంత వాస్తవం ఉన్నా నిర్మాతలు రాజమౌళి సినిమాల పై ఖర్చు పెట్టె స్థాయిలో మరో దర్శకుడుని నమ్మి ఖర్చు పెట్టరు. దర్శకుడు మణిరత్నం ఒక చారిత్రాత్మకమైన కథను 1000 కోట్ల బడ్జెట్ తో ఒక భారీ సినిమాను తీయ డానికి స్క్రిప్ట్ రెడీ పెట్టుకున్నా అలాంటి ప్రముఖ దర్శకుడుకి కూడా ప్రస్తుత పరిస్థుతులలో నిర్మాతలు దొరకని విషయం భరద్వాజకు తెలియదా అన్నదే ప్రశ్న..   


మరింత సమాచారం తెలుసుకోండి: