విక్టరీ వెంకటేష్ నటించిన కూలీ నెం.1 సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది అందాల భామ టబు.  ఆమె సోదరి ఫర్హా బాలీవుడ్ ల నటిగా కొనసాగుతుంది.  కూలీ నెం1 మంచి హిట్ అందుకున్న తర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లొ నటించింది టబు.  తర్వాత నాగార్జున సరసన ‘నిన్నె పెళ్లాడుతా’సినిమాతో మంచి విజయం అందుకున్న టబు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్లోకి వచ్చింది. 

 టబు పుట్టింది..పెరిగింది  హైదరాబాద్ లోనే అయినా ఎక్కువగా కెరీర్ కొనసాగించింది మాత్రం ముంబైలోనే..కానీ రెండు తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.  నార్త్ డోర్స్ ఓపెన్ అవ్వగానే బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసిన అమ్మడు సౌత్ సినిమాలు నచ్చితేనే చేస్తోంది.  టబు కి కి నాలుగు పదుల వయసు ధాటి 50లోకి వచ్చేస్తోంది. 

అయితే టబు ఇప్పటికీ కుమారిగానే ఉన్నారు..పెళ్లి విషయం వచ్చినప్పుడల్లా ఏవో కారణాలు చెబుతూ దాటించేసింది.  ఇటీవల అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో టబు తల్లి పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి.  కానీ హోమ్లీ క్యారెక్టర్ అయినా హాట్ హీరోయిన్ గా అయినా మెరవడానికి తాను సిద్దమే అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ గా చెప్పేసింది.  తాజాగా టబు నటించిన  దే దే ప్యార్ దే రిలీజ్ కు రెడీ అవుతోంది. అందులో అజయ్ దేవగన్ భార్యగా నటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: