విశాఖ‌ప‌ట్నం బీచ్ రోడ్ లో గ‌ల దాస‌రి నారాయ‌ణ‌రావు,  నంద‌మూరి హ‌రికృష్ణ‌ల విగ్ర‌హాల‌ను అర్థ‌రాత్రి గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వారు తొలిగించ‌టం అన్యాయ‌మ‌నీ, ఒక‌వేళ అనుమ‌తులు లేక‌పోతే విగ్ర‌హాలు నెల‌కొల్పి సుమారు ఆరు నెల‌ల కావొస్తోంది జివిఎమ్‌సి వారు ఏమి చేస్తున్నారనీ, ఉత్త‌రాంధ్ర సినీ ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు , ద‌ర్శ‌కుడు యాద‌కుమార్ అన్నారు.


సినీ రంగానికి వ‌న్నె తెచ్చిన ద‌ర్శ‌కుడు దాస‌రి గారి విగ్ర‌హం తొల‌గించ‌డం ద్వారా తెలుగు క‌ళా రంగాన్ని అవ‌మానించ‌డ‌మే అని సంఘ కార్య‌ద‌ర్శి, ద‌ర్శ‌కుడు కారెం విన‌య్ ప్ర‌కాష్ అన్నారు.


నాట‌క రంగ ప్ర‌ముఖుడు, రంగ‌సాయి, నాట‌క సంఘం అధ్య‌క్షుడు `బాదంగీర్ `సాయి మాట్లాడుతూ...``అత్యంత చిన్న స్థాయి నుండి ఎంతో ఉన్న‌త స్థాయికి వ‌చ్చి, తెలుగు సినీ రంగంలో ఎంతో ఉన్న‌త‌మైన చిత్రాలు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దాస‌రి గారి విగ్ర‌హాన్ని`ఉత్త‌రాంధ్ర సినీ ద‌ర్శ‌కుల సంఘం``ఆధ్వ‌ర్యంలో అన్ని అనుమ‌తుల‌తో త్వ‌ర‌లో నెల‌కొల్పుతామ‌ని`` అన్నారు.


 ఉత్త‌రాంధ్ర ద‌ర్శ‌కులు ర‌మేష్‌, శివశ్రీ, గీతాల‌య ప్ర‌సాద్,  రాకేష్ రెడ్డి, లోలుగు రాజ‌శేఖ‌ర్ ల‌తో పాటు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన సినీ, టీవీ న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు పెద్ద సంఖ్య‌లో ధ‌ర్నాలో పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: