ఇటీవల కొద్దిరోజుల నుండి వైసిపి నాయకురాలు, దివంగత నటులు మరియు మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మి పార్వతిని కొందరు ఆకతాయిలు ఆమె ఇమేజీకి భంగం వాటిల్లేలా సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ లు మరియు వీడియోలు పెడుతున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీస్ లను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతేకాక తనను అసభ్య పదజాలంతో ఫోన్ లు చేసి విసిగిస్తూ మాట్లాడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

ఇక మరోవైపు టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కూడా ఇటీవల డిజిపిని కలిసి తనపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తూ మీడియా మాధ్యమాల్లో వీడియోలు ప్రసారం చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలనీ ఒక ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీద్దరి కేసులలో వారిని ఆ విధంగా ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తి ఒకరే అని తేలిందని పలు వార్త మరియు మీడియా విభాగాల్లో వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరి నుండి ఫిర్యాదులు స్వీకరించిన తరువాత నిశితంగా తమ విచారణను ప్రారంభించిన పోలీసులకు ఆ ఇద్దరి కేసుల్లో ఒకే ఒక కీలక వ్యక్తి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తేలిందట.  హైదరాబాద్ లోని ఫిలిం నగర్ ప్రాంతంలో అతడు కొందరు స్నేహితులతో కలిసి ఒక పర్సనల్ కంప్యూటర్ ద్వారా ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు సమాచారం. 



అయితే అతడు ఇటువంటివి వారిద్దరిపై కక్షతో చేశాడా, లేక అతడిని మరెవరైనా ప్రేరేపించారా అనే విషయమై మాత్రం ఇంకా తేటతెల్లం కాలేదని, ఇక ఎప్పుడైతే పోలీసులు అతడి స్థావరాన్ని పసిగట్టారో, వెంటనే అతడు తన స్నేహితులతో కలిసి పారిపోయాడని, ఇక వారిని పట్టుకునేందుకు కొందరు పొలిసు బలగాలు కూడా రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపులు చేపట్టడం ప్రారంభించాయట. అయితే అతడు దొరికితేనే కానీ ఇటువంటివి ఎందుకు చేస్తున్నాడో, ఎవరు చేయిస్తున్నారో అనేటువంటి పూర్తి సమాచారం బయటకు రాదని పోలీసులు చెపుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.... 


మరింత సమాచారం తెలుసుకోండి: