సాధారణంగా ఈ భూమిపై మనుషులను పోలిన మనుషులు ఉంటారని అంటుంటారు. ఇలాంటి రూపాలు కవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొంత మంది కవల పిల్లలు సరైన గుర్తు లేకుంటే ఎవరు ఎవరని పోల్చుకోవడం కష్టం. ఇలాంటి సినిమాలు తెరపై ఎన్నో కనిపించిన విషయం తెలిసిందే. డబుల్ కాదు త్రిబుల్ రోల్స్ లో కూడా హీరోలు కనిపిస్తుంటారు. అలాంటి సినిమాలకు మంచి ఆదరణ కూడా లభిస్తుంది.
ఇక మనిషిని పోలిన మనిషి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు తారస పడుతుంటారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇలాంటి సిత్రాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోలను పోలిన మనుషులు తారన పడితే వెంటనే అలాంటి ఫోటోలు వైరల్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ను పోలిన ఓ వ్యక్తి పంజాబ్‌లో ఉన్నాడు. అతడి పేరు శమీందర్ సింగ్. ట్విట్టర్లో తన ఫోటోలు, వీడియోలతో హల్చల్ చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ట్విస్ట్ ఏంటంటే.. శమీందర్ సింగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అట. ఎన్టీయార్ సినిమా సినిమాకు చూపించే వేరియేషన్‌ను శమీందర్ కూడా ఫాలో అయిపోతున్నాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ వచ్చిందంటే చాలు తాను కూడా అదే లుక్‌లోకి మారిపోతున్నాడు.
సోషల్ మీడియాలో అదే చెబుతూ తన అభిమాన హీరోని కలవాలని ఉందంటూ కోరిక వెలిబుచ్చుతున్నాడు. తారక్‌లా కనిపిస్తున్న శమీందర్ను చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.