మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా బాక్సాఫీస్‌ను దున్నేస్తోంది. గురువారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన మ‌హ‌ర్షి వ‌ర‌ల్డ్ వైడ్‌గా కేవ‌లం 4 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.65 కోట్ల షేర్ రాబ‌ట్టింది. మ‌హేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కిన మ‌హ‌ర్షి డివైడ్ టాక్‌తో కూడా ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో ట్రేడ్ వ‌ర్గాలు సైతం షాక్‌లో ఉన్నాయి.

ఇక నైజాంలో మ‌హేష్ హిట్ సినిమాల‌కు కూడా రాని వ‌సూళ్లు మ‌హ‌ర్షి కేవ‌లం 6 రోజుల్లోనే సొంతం చేసుకుంది. నైజాంలో ఇప్ప‌టికే రూ 20.45 కోట్ల షేర్ రాబ‌ట్టిన మ‌హ‌ర్షి గ‌తంలో మ‌హేష్ హిట్ సినిమాల‌కు వ‌చ్చిన వ‌సూళ్ల‌ను కూడా క్రాస్ చేసేసింది. మ‌హ‌ర్షి 6 రోజుల ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి. ఇక మ‌హ‌ర్షి స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మ‌హేష్ ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టించ‌నున్నాడు.

ఏరియా - షేర్  (కోట్లలో)
నైజాం - 20.45సీడెడ్ -  6.25
నెల్లూరు -  2.01
కృష్ణా -  4.12
గుంటూరు - 6.31
వైజాగ్ -  7.25
ఈస్ట్ -  5.38
వెస్ట్ -   4.21
-------------------------------------
ఏపీ + తెలంగాణ షేర్ =  55.98
--------------------------------------



మరింత సమాచారం తెలుసుకోండి: