Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 2:40 pm IST

Menu &Sections

Search

ఈసారి రామ్ హిట్ కొట్టేలా ఉన్నాడే!

ఈసారి రామ్ హిట్ కొట్టేలా ఉన్నాడే!
ఈసారి రామ్ హిట్ కొట్టేలా ఉన్నాడే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో నేడు రామ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. టీజర్ లో రామ్ ని చూస్తే, ఇది పక్కా మాస్ కమర్షియల్ చిత్రం అని అర్ధం అవుతుంది. ఇక టీజర్ లో రామ్ తన మార్క్ స్టైలిష్ యాక్టింగ్ తో పూరి మార్క్ డైలాగ్స్ ని చెప్పడం చూస్తుంటే, రేపు సినిమా విడుదల తరువాత సినిమా మంచి విజయం సాదిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 


ఇక మొదటి నుండి తన సినిమాల్లో హీరో క్యారెక్టరైజెషన్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే పూరి, ఈ సినిమాలో కూడా రామ్ ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నట్లు టీజర్ లో మనకు అర్ధం అవుతుంది. ఇక టీజర్ లో రామ్ చెప్పిన డైలాగ్స్ కూడా అయన ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్ లో  "నాతో కిరీరంటే పోచమ్మ గుడిముందర పొట్టేలుని కట్టేసినట్టే"  అనే డైలాగు అందరిని ఆకట్టుకుంటోంది. ఇక టీజర్ లో చాలారోజుల తరువాత మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన మార్క్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగా ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. టీజర్ మొత్తం మంచి ఎనర్జీ తో సాగుతుంది. ఒకరకంగా ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయని చెప్పాలి. 


ఇక మణిశర్మ సంగీతసారథ్యంలోని పాటలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ కు జోడిగా నిధి అగర్వాల్, నాభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇకపోతే కొన్నాళ్ల నుండి సరైన హిట్ లేని దర్శకుడు పూరి, మరియు హీరో రామ్ ఈ చిత్రం తప్పకుండా తమకు మంచి బ్రేక్ ని ఇస్తుందని వారు గట్టి నమ్మకంతో అన్నారు. మరి రేపు విడుదల తరువాత ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం చిత్రం విడుదల వరకు వేచిచూడవలసిందే.....     


ismart-shankar-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విధంగా చూస్తే అఖిల్-భాస్కర్ ల మూవీ హిట్టేనట...!!
"రెడ్డి గారి అబ్బాయి" గా మహేష్ బాబు?
నాని 'జెర్సీ' మూవీ ఓవర్ అల్ కలెక్షన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే...!!
ఆ సినిమాతో రవితేజకు హిట్ ఖాయమట...!!
ఇకపై ఆ ఒక్క పని మాత్రమే చేస్తాను : ఛార్మి
మెగాస్టార్ సైరాలో నటిస్తున్న నటుడి మృతి...??
బాలయ్య సరసన ఛాన్స్ కొట్టేసిన ఆర్ఎక్స్100 భామ?
మహేష్ మరొక ప్రాజెక్టుకు ఓకె చెప్పారా...??
టివి ఛానల్ బిజినెస్ లోకి బాహుబలి...??
కమల్ భారతీయుడు-2 ఆగిపోలేదట... అసలు మ్యాటర్ ఇదే..!!
మహర్షి వసూళ్ల సునామీకి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు...!!
అందుకే మరోసారి గర్వంగా కాలర్ ఎగరేస్తున్నా : మహేష్ బాబు
About the author

Most of us are not even aware of that voice that lives inside us, viciously so. Unfortunately, I have been in a long-term abusive relationship with my Inner Critter for years. My Inner Critter poses as an Ivy League tweed-clad professor, and I tend to assign immediate power to anyone boasting to have a "smart" bespectacled academic Joycean opinion, especially about writing.

NOT TO BE MISSED