'దేవదాస్' వంటి సూపర్ హిట్ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటరైన గోవా బ్యూటీ ఇలియానా పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరుంటారు చెప్పండి? పవర్‌స్టార్
పవన్ కళ్యాణ్ తో 'జల్సా', మహేష్ బాబు తో 'పోకిరి' లాంటి టాప్ సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా ఎన్నో సూపర్ హిట్లు సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఇలియానా ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది. రీసెంట్‌గా 'అమర్ అక్బర్ అంటోని' తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ ముంబై ఫ్లైట్ ఎక్కేసింది.


ఇక రీసెంట్ గా ఇలియానా లుక్స్ పరంగా సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బేసిక్‌గ్గా ఇలియానా చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు తనలాంటి ఫిజిక్ ఎవరికి ఉండదని ప్రేక్షకుల్లో ఓ అభిప్రాయం. కానీ కొంత కాలం క్రితం కాస్త వెయిట్ పెరిగింది. అంతేకాదు రీసెంట్‌గా తెలుగులో రవితేజతో నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' లో కూడా ఇలా బొద్దుగానే కనిపించింది.  దీంతో అందరూ బొద్దుగా ఉందని కామెంట్ చేశారు. 


ఈ కామెంట్స్‌తో వర్కౌట్స్ చేసి మళ్ళీ నాజూగ్గా తయారైంది. మేకప్ బాగా వేసుకొని పార్టీలకు, పబ్ లకు వెల్తోంది. ఆ టైమ్ లో తీసిన కొన్ని ఫొటోలు సొషల్ మీడీయాలో తెగ తిరిగేస్తున్నాయి. అవి చూసిన జనం మొత్తానికి సన్నబడటం వరకు ఓకే గాని ఎంత మేకప్ వేసినా వయసు తెలిసిపోతుందే..ఇదేలా చేస్తారు అని మళ్ళీ మొదలు పెట్టారు. అయితే ఇలాంటి కామెంట్స్ అన్నీ లైట్ తీసుకున్న ఇలియానా 'పాగల్ పంటి' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తూ బిజి బిజీగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: