ఈ సంక్రాంతికి వ‌చ్చిన ఎఫ్ 2 సినిమా టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. వరుణ్ తేజ్- వెంకటేష్ కలిసి నటించిన ఎఫ్ 2 త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి తిరుగులేని విజ‌యం సాధించ‌డంతో పాటు నిర్మాత దిల్ రాజుకు రూపాయికి ఏకంగా మూడు రూపాయ‌ల లాభం తెచ్చిపెట్టింది. వ‌రుణ్‌తేజ్‌కు ఫిదా త‌ర్వాత కెరీర్‌లో ఎఫ్ 2 ఓ మంచి హిట్ సినిమాగా నిలిచింది.

ఎఫ్ 2లో వ‌రుణ్‌తేజ్ పాత్ర‌కు కూడా మంచి పేరు వ‌చ్చింది. ఫిదా, తొలిప్రేమ‌, ఎఫ్ 2 సినిమాలు వ‌రుస‌గా హిట్ అవ్వ‌డంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు అటు అమెరికాలోనూ వ‌రుణ్ మార్కెట్ బాగా పుంజుకుంది. ఇక త‌న రేటు పెంచేందుకు కొద్ది రోజులుగా వెయిట్ చేస్తోన్న వ‌రుణ్ ఇదే క‌రెక్ట్ టైం అని అమాంతం త‌న రెమ్యున‌రేష‌న్ పెంచేశాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమా కి మూడు కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రేటు కాస్త డ‌బుల్ చేసేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

మూడు కోట్ల పారితోషికం కాస్త ఆరు కోట్లు అయిందట. ఈ రేటు చూసి టాలీవుడ్ నిర్మాత‌ల క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయ‌ట‌. వ‌రుణ్‌తో సినిమా అంటే వామ్మో అనే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఈ కొత్త రేటు కూడా వ‌రుణ్ కొత్త చిత్రం వాల్మీకి నుంచి అమ‌ల్లోకి రానుంద‌ట‌. ఈ సినిమాను 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేయ‌గా... ఆమె త‌ప్పుకోవ‌డంతో మ‌రో హీరోయిన్ కోసం ఎంపిక వెతుకులాట‌లో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: