జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతం మళ్లీ మరో సినిమాతో తెచ్చిపోతుంది. శివరంజని అంటూ ఓ రొమాంటిక్ హర్రర్ సినిమాతో వస్తుంది రష్మి గౌతం. నాగ ప్రభాకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. టీజర్ చూస్తే రష్మి మరోసారి రెచ్చిపోయిందని తెలుస్తుంది. ఈమధ్యనే అంతకుమించి అంటూ భయపెట్టే ప్రయత్నం చేసిన రష్మి ఇప్పుడు శివరంజనిగా వస్తుంది.


నందు హీరోగా వస్తున్న ఈ సినిమా కథ టీజర్ లో చూపించారు. లవర్స్ అయిన నందు, రష్మి ఓ బంగ్లాకి వెళ్లడం అక్కడ దెయ్యం రష్మిని ఆవహించడం లాంటి కథతో వస్తుంది శివరంజని. రొటీన్ సినిమాలానే అనిపిస్తున్నా రష్మి అందానికి ప్రేక్షకులు ఫిదా అవడం ఖాయమని చెప్పొచ్చు. చూస్తుంటే రష్మి తన అందాలకు గట్టిగానే పని చెప్పినట్టు అనిపిస్తుంది.


ట్రైలర్ లో కొత్త కొత్త టేష్టులు చూపిస్తా అంటూ ఊరిస్తున్నా సినిమా కథ మాత్రం పక్కా రొటీన్ అనిపిస్తుంది. ఓ పక్క యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తున్న రష్మి సినిమాలతో కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది. గుంటూర్ టాకీస్ నుండి రష్మి సినిమా అంటే ఆడియెన్స్ లో ఓ క్యూరియాసిటీ మొదలైంది.


అవకాశం ఉన్న సినిమాలన్నిటిని చేస్తూ రష్మి తన కెరియర్ కొనసాగిస్తుంది. అయితే ప్రతి సినిమాలో అమ్మడు హాట్ గా కనిపించడం తప్ప పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలా అనిపించదు. మరి శివరంజని అయినా రష్మికి మంచి పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలి. ట్రైలర్ అయితే ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: