గ్లామర్ ప్రపంచంలో అందం ఉన్నప్పుడే అన్ని చక్కబెట్టుకోవాలి.  అలా చేయాలంటే... చేతిలో ఆఫర్లు ఉండాలి.  ఒక్కసారి వయసు పెరిగాక అవకాశాలు తగ్గిపోతాయి.. ఈ విషయం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది.  అందుకే చాలామంది హీరోయిన్లు వయసు ఉండగానే హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ క్యాష్ చేసుకుంటుంటారు.  


మూవీస్ లో హాట్ హాట్ గా కనిపిస్తూ అవకాశాలు దక్కించుకుంటారు.  ఈ విషయం టాలీవుడ్ కంటే హాలీవుడ్ హీరోయిన్లకు బాగా తెలుసు.  జెన్నిఫర్ అగస్టీన్ టీవీ సీరియల్స్ తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి హాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.  సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈ భామ టాప్ హీరో బ్రాడ్ పిట్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. 

కొంతకాలం తరువాత విడిపోయారు అది వేరే విషయం అనుకోండి.  ఇప్పుడు ఈ భామ వయసు 50.  ఈ వయసులో కూడా చాలా అందంగా ఉంది.  అంతేకాదు హర్పర్స్ బజార్ అనే ప్రముఖ మ్యాగజైన్ కోసం ఏకంగా టాప్ లెస్ ఫోటో షూట్ చేసి పిచ్చెక్కిచింది.  ఎద అందాలను చేత్తో కవర్ చేస్తూ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


ఈ ఫొటోస్ కు లక్షలాది మంది అభిమానులయ్యారు.  రీసెంట్ గా 50 వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది.  ఈ వేడుకలకు హాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు తన మాజీ భర్త బ్రాడ్ పిట్ ను కూడా ఆహ్వానించింది.  పిట్ ఈ వేడుకకు హాజరయ్యారు.  ఏంజలీనా జోలీతో విడాకులు తీసుకున్నాక ఈ హీరో ఒంటరిగా ఉంటున్నారు.  జెన్నిఫర్ ను తిరిగి వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: