టాలీవుడ్ లో ఈ మద్య కొత్త సినిమాలు..కొత్త నటులు, దర్శకులు పరిచయం అవుతున్నారు.  అదే విధంగా కొత్త సంస్థలతో నిర్మాతలు కూడా పెట్టుబడులు పెడుతున్నారు.  అయితే కంటెంట్ బాగుండి ప్రేక్షకాదరణ తో కొన్ని సినిమాలు బాగానే రన్ అవుతున్నా..వీరికి థియేటర్ల ఇబ్బందులు..ఇతర సినీ కష్టాలు తప్పడం లేదు.  తాజాగా చిన్న నిర్మాతలకు ఊరట కలిగించే రెండు శుభవార్తలు వెంట వెంటనే వచ్చాయి. సినిమా, సీరియ‌ల్స్‌, డిజిట‌ల్ మాధ్య‌మాల్లో కొన్ని నిర్ణయాలను మారుస్తూ టారిఫ్ రేట్ కార్డ్ పై ఒక నిర్ణయానికి వచ్చారు. 


కొంత బడ్జెట్ అనుకొని షూటింగ్ మొదలు పెడితే ఆ బడ్జెట్ మించి పోవడం చూస్తున్నాం..కారణాలు ఏవైనా చివరికి నిర్మాతలుక కష్టాలు మాత్రం తప్పడం లేదు.  ఇక షూటింగ్ సమయాల్లో ఏవైనా వణ్య ప్రాణులను వాడుకోవాల్సి వస్తే..అది తలకు మించిన భారమే అవుతుంది.  తాజాగా ఈ ఇబ్బందులు తొలగిపోయే సమయం వచ్చింది.  ఇక నుంచి కొన్ని షరతుల మేరకు వాటిని షూటింగ్ లో ఉపయోగించుకోవచ్చని ఆర్డర్ వచ్చింది. వ‌న్య ప్రాణి సంర‌క్ష‌ణ విభాగం ఆన్‌లైన్‌లో నిర్మాతలు అప్లై చేసుకొని షూటింగ్ చేయవచ్చు. 


అదే విధంగా ఇప్పటి వరకు  350 ప్రదర్శనలు పూర్తయితే  కానీ మినీ బడ్జెట్ సినిమాలకు డిజిట‌ల్ టారిఫ్ రేట్ కార్డ్ అదుపులోకి రావడం లేదు.ఈ నేపథ్యంలో డిజిటల్ ప్రొవైడర్స్‌, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చారు. క్యూబ్‌, యు.ఎఫ్‌.ఒ త‌ర‌హాలో స్క్రాబెల్ సైతం షో ట్రాన్స్‌ఫ‌ర్‌కి ఎలాంటి చార్జీలు తీసుకోబడదని రూల్ పాస్ చేశారు. ఇదివరకు ట్రాన్స్‌ఫ‌ర్ చార్జీలుగా 35,500 రూపాయలను వసూలు చేసేవారు. మొత్తానికి ఇప్పుడు చిన్న నిర్మాతలు కొత్త సినిమాలకు పెట్టుబడులు పెట్టేందుకు సరైన అవకాశమని..కొత్త సినిమాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఫిలిమ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: