Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 10:33 am IST

Menu &Sections

Search

అందుకే మరోసారి గర్వంగా కాలర్ ఎగరేస్తున్నా : మహేష్ బాబు

అందుకే మరోసారి గర్వంగా కాలర్ ఎగరేస్తున్నా : మహేష్ బాబు
అందుకే మరోసారి గర్వంగా కాలర్ ఎగరేస్తున్నా : మహేష్ బాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారు. అయితే అందుకు ప్రధాన కారణం ఇటీవల అయన నటించిన 25వ సినిమా మహర్షి అన్ని అంచనాలు అందుకుని అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లు సాధిస్తూ సూపర్ హిట్ దిశగా సాగుతుండడంతో మొత్తం యూనిట్ సభ్యులతో సహా సూపర్ స్టార్ కూడా అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్, అక్కడక్కడా కాస్త తగ్గుతున్న కలెక్షన్లను సైతం పెంచేందుకు, అభిమానులకు మంచి బూస్ట్ నిచ్చేలా సినిమాకు పలు విధాలుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇక అందులోభాగంగా అయన నిన్న మహర్షి సక్సెస్ ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎమ్ ఎమ్ థియేటర్ కు విచ్చేసారు. 


ఆయనతోపాటు హీరోయిన్ పూజ హెగ్డే, యాక్టర్ అల్లరి నరేష్, దర్శకుడు వంశీ కూడా థియేటర్ కి విచ్చేసి అభిమానులతో ముచ్చటించారు. ఇక మహేష్ బాబు మాట్లాడుతూ, ఈ 20 ఏళ్లలో నేను చేసిన 25 సినిమాలలో నాకు మహర్షి ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఇక తాను ఇటీవల ఇక్కడే ఏఎంబి సినిమాస్ పేరుతో ఒక మల్టిప్లెక్స్ కట్టడం జరిగిందని, అయినప్పటికీ కూడా అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఈ సుదర్శన్ థియేటర్ ని తన సొంత థియేటర్ గా భావిస్తానని అన్నారు.  విడుదలైన దగ్గరినుండి మహర్షి కి వస్తున్న ప్రశంశలు, అలానే కలెక్షన్లు చూస్తుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉందని, ఇది కేవలం అభిమానులైన మీ వల్లనే సాధ్యం అయిందని, మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు మాట్లాడారు. 


మురారి సినిమా తరువాత ఇన్నేళ్లకు తాను సుదర్శన్ థియేటర్ కు విచ్చేయడం జరిగిందని, ఈ రోజు ఫ్యాన్స్ తో కలిసి కేరింతల మధ్య మహర్షి సినిమా చూడడం నిజంగా తన లైఫ్ లో ఒక మర్చిపోలేని అనుభూతని మహేష్ చెప్పుకొచ్చారు. ఈ విజయం నిజమైన విజయమని, ఇంతటి అద్భుత విజయాన్ని మాకు ఇచ్చినందుకు మరొక్కసారి కాలర్ ఎగరేస్తున్నానని అయన అభిమానుల సమక్షంలో అయన కాలర్ ఎగరేయడం జరిగింది. ఇక మహేష్ బాబు సుదర్శన్ థియేటర్ కు విచ్చేస్తున్నారు అని తెలియగానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతం అంతా ఒక్కసారిగా కోలాహలంగా మారిపోయింది..మరి రాబోయే రోజుల్లో ఈ మహర్షి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొట్టి ముందుకు సాగుతాడో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వేచిచూడాల్సిందే.... 


mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Most of us are not even aware of that voice that lives inside us, viciously so. Unfortunately, I have been in a long-term abusive relationship with my Inner Critter for years. My Inner Critter poses as an Ivy League tweed-clad professor, and I tend to assign immediate power to anyone boasting to have a "smart" bespectacled academic Joycean opinion, especially about writing.