ఆమె ఎంట్రీయే హాట్ హాట్ గా సాగింది. బోల్డ్ టైప్ గా కనిపిస్తూ కిర్రెక్కించే ఈ బ్యూటీ ఒక్కసారిగా టాలీవుడ్ ని తనవైపు తిప్పుకుంది. ఆర్ ఎక్స్ 100  సినిమా తరువాత ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. ఆమెను ఐటెం బాంబ్ గానే చూశారు. పోనీ అలాగే అనుకుని కొన్ని మూవీస్ లో ఆమె ఆవే చేసింది. ఇపుడు మరో ట్విస్ట్. హీరోయిన్ గా తీసుకుంటున్నారు కానీ..


అక్కడ పెయిర్ మాత్రం సీనియర్లు. ఓ వైపు వెంకీ మామలో విక్టరీ వెంకటేష్ పక్కన జోడీ, మరో వైపు డిస్కో రాజాలో రవితేజా పక్కన చాన్స్, ఈ రెండూ ఇలా ఉంటే ఇపుడు మరో న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే  సీనియర్ మోస్ట్ హీరో బాలయ్య కొత్త సినిమాల్లో పాయల్ రాజ్ పుత్ జంట కట్టబోతోంది అని. కే ఎస్ రవికుమార్  డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో ఒక హీరోయిన్ గా పాయల్ హొయల్ ఒలకబోస్తుందంట.


దీని బట్టి చూస్తే పాయల్ మొత్తానికి సీనియర్లకు పడిపోయిందా అనిపిస్తోంది. పట్టుమని పాతికేళ్ళు లేని పాయల్ అందానికి అందం ఉన్నా యంగ్ హీరోస్ మాత్రం పక్కన నో చాన్స్ అంటున్నారు. ఆర్ ఎక్స్ 100 రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టి కూడా ఏడాది అయిపోయింది. దాంతో చేసేది లేక వచ్చిన అవకాశాలకు పాయల్ ఓకే అంటోందట. అవి సీనియర్ల నుంచే రావడంతో ఈ చిన్నది అపుడే పెద్దది అయొపోయిందా అంటున్నారు. ఒక్కసారి సీనియర్ల పక్కన వేస్తే మరి యంగ్ హీరోలు అసలు పట్టించుకోరు. మొత్తానికి హాట్ హాట్ గా వచ్చిన పాయల్ కధ మాత్రం సీనియర్ల దగ్గరే ఆగిపోయింది


మరింత సమాచారం తెలుసుకోండి: