‘సైరా’ ను ఎట్టి పరిస్తుతులలోను అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున విడుదల చేయాలి అన్న పట్టుదలతో పరుగులు తీస్తున్న ‘సైరా యూనిట్ ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి రొమాంటిక్ సీన్స్ చిత్రీకరణ విషయంలో మనసు పెట్టింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితానికి సంబంధించిన చరిత్ర పెద్దగా ఆధారాలు లేకపోవడంతో కేవలం కొందరు చరిత్ర కారులు చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని ‘సైరా’ కథను అల్లారు. 

దీనికితోడు ఈకథ 18వ శతాబ్ధానికి చెందినది కావడంతో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్రకు సంబంధించి అక్కడక్కడా లభించిన శాసనాలు తప్పించి పెద్దగా ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాలు లేవు. దీనితో ఈ మూవీకి కథను సమకూర్చిన పరుచూరి బ్రదర్స్ తమకు తెలిసిన కథను సినిమా కథగా మార్చడానికి చాల మార్పులు చేసినట్లు సమాచారం. 

ఇలాంటి పరిస్థుతులలో ఈకథను చరిత్రగా తీయకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకర్షించడానికి కొన్ని రొమాంటిక్ సీన్స్ ను కూడ క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈసినిమాకు సంబంధించి ఒక రొమాంటిక్ సాంగ్ నీ చిరంజీవి నయన తారల పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈపాట షూటింగ్ పూర్తి అయిన తరువాత చిరంజీవి తమన్నాల పై మరో డ్రీమ్ సాంగ్ చిత్రీకరణ కూడ ఉంటుంది అని అంటున్నారు. చిరంజీవి సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండాలి కాబట్టి ఈ వ్యూహాలు అనుసరిస్తున్నట్లు టాక్. అయితే ఒక చారిత్రక కథకు ఇలా రొమాంటిక్ సీన్స్ డోస్ ఎక్కువగా పెడితే అసలు కథలోని పట్టు తప్పే ప్రమాదం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: