కమెడియన్స్ దర్శకులుగా మారకూడదా? ఎందుకు మారకూడదు? ఎంతోమంది కమెడియన్లు డైరక్టర్లు అయ్యారు. చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హాస్యనటుడు కూడా చేరాడు. అతనే శ్రీనివాసరెడ్డి. కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి మెగా ఫోన్ పట్టాడు. ఓ సినిమా తీశాడు. ఆ సినిమా పేరు 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'. 

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న హాస్యనటులంతా కలిసి 'ఫ్లయింగ్ కలర్స్' పేరుతో ఎప్పటికప్పుడు గెట్-టు-గెదర్స్ పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా కలుస్తున్న వీళ్లంతా నిర్మాతలుగా మారి, అదే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి కమెడియన్ శ్రీనివాస రెడ్డిని దర్శకుడిగా మార్చారు.


బ్రహ్మానందం నుంచి షకలక శంకర్ వరకు దాదాపు హాస్యనటులంతా ఈ సినిమాలో నటించారు. మూవీ మొత్తం ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అయితే గతంలో స్టార్ కమెడియన్ గా వెలుగొందిన ఎం.ఎస్.నారాయణ, ఏ.వీ.ఎస్ ఇలా డైరెక్టర్లు గా మారే చేతులు కాల్చుకున్నారు. మరి శ్రీనివాస రెడ్డి అయినా డైరెక్టర్ గా సక్సస్ అవుతాడో లేదా వాళ్ళ లాగా ఫేల్యూర్ గా ముద్ర వేసుకుంటాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: