Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 12:49 pm IST

Menu &Sections

Search

టివి ఛానల్ బిజినెస్ లోకి బాహుబలి...??

టివి ఛానల్ బిజినెస్ లోకి బాహుబలి...??
టివి ఛానల్ బిజినెస్ లోకి బాహుబలి...??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈశ్వర్ సినిమాతో టాలీవడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, ఆ సినిమా విజయంతో మంచి పేరు సంపాదించారు. ఇక ఆ తరువాత అయన నటించిన వర్షం, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి చిత్రాలు ప్రభాస్ కు మంచి విజయాన్ని అందించాయి. అనంతరం అయన రాజమౌళి దర్శకత్వంలో చేసిన బాహుబలి రెండు భాగాలూ ఎంతటి సెన్సేషన్ హిట్ గా నిలిచాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఒకరకంగా ప్రభాస్ కెరీర్ గురించి ఒక్క మాటలో  చెప్పాలంటే, బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అనే చెప్పుకోవాలి. 


ఇక ప్రస్తుతం రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సాహూ మరియు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో  మరొక సినిమాలో నటిస్తున్న ప్రభాస్, ప్రస్తుతం ఒక పాన్ ఇండియా అపీల్ ఉన్న హీరో అని చెప్పాలి. అంతేకాదు ప్రస్తుతం అయన మార్కెట్ రేంజి కూడా బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తగ్గదు. ఇక ఈ రెండు సినిమాలు కూడా అయన మార్కెట్ రేంజికి తగ్గట్లే భారీ ఖర్చు మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్నాయి. ఇకపోతే అసలు మ్యాటర్ లోకి వెళితే, మన బాహుబలి తన స్నేహితులతో కలిసి త్వరలో ఒక టివి ఛానల్ ని నెలకొల్పబోతున్నట్లు నిన్నటి నుండి కొన్ని మీడియా వర్గాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు స్నేహితులు ఆ ఛానల్ కు ప్రాతినిధ్యం వహించనున్నారట. 


అంతేకాదు ఇప్పటికే ఆ ఛానల్ కు ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని, మరికొద్దిరోజుల్లో ఛానల్ ను అధికారికంగా ప్రారంభించడం జరుగుతుందని అంటున్నారు. అయితే ఇది న్యూస్ ఛానలా లేక ఎంటర్టైన్మెంట్ ఛానలా అనేది మాత్రం తెలియరాలేదు. నిజానికి ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా కూడా ప్రభాస్ నుండి కానీ అయన స్నేహితుల నుండి కానీ అధికారికంగా సమాచారం మాత్రం లేదనే చెప్పాలి. మరి ప్రస్తుతం టాలీవుడ్ మరియు మీడియా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే మాత్రం ప్రభాస్ నుండి అధికారిక ప్రకటన వెలువడేవరకు వేచిచూడాల్సిందే మరి....!!!  



bahubali
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Most of us are not even aware of that voice that lives inside us, viciously so. Unfortunately, I have been in a long-term abusive relationship with my Inner Critter for years. My Inner Critter poses as an Ivy League tweed-clad professor, and I tend to assign immediate power to anyone boasting to have a "smart" bespectacled academic Joycean opinion, especially about writing.