‘మహర్షి’ సక్సస్ ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. కొన్ని ఏరియాలలో ఈమూవీకి వస్తున్న కలక్షన్స్ మహేష్ అభిమానులకు జోష్ ను ఇస్తుంటే మరికొన్ని ఏరియాలలో ఈమూవీకి కలక్షన్స్ విషయంలో ఎదురౌతున్న ఎదురీత టాలీవుడ్ విశ్లేషకులకు కూడ అర్ధంకాని విషయంగా మారింది. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాకు ఇలాంటి వైరుధ్యం ఎప్పుడు చూడలేదు అని అంటున్నారు. ఈమూవీకి నైజాం ఏరియాలో 20 కోట్ల షేర్ మొదటివారంలోనే రావడం అక్కడి బయ్యర్లకు జోష్ ను కలిగిస్తుంటే రాయలసీమలో మాత్రం ‘మహర్షి’ పరిస్థితి చాల ఇబ్బందికరంగా ఉంది.

ఆంధ్రా ప్రాంతలో ఈమూవీ కలక్షన్స్ రికార్డ్ స్థాయిలో లేకపోయినా సంతృప్తి కరంగా ఉన్నాయి అని అంటున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు రాయలసీమ ప్రాంతంలో ‘మహర్షి’ తొలి వారంలో 6.86 కోట్ల షేర్ మాత్రమే సాధించింది అని అంటున్నారు. అయితే ఈసినిమా 12 కోట్లకు పైగా షేర్ రాబడితేనే తప్ప రాయలసీమ బయ్యర్ కు బ్రేక్ ఈవెన్‌కు రాని పరిస్థితి. దీనితో ఈసినిమా వల్ల రాయలసీమ బయ్యర్ కు నష్టాలు తప్పవు అని అంటున్నారు. 

ఇక ముఖ్యంగా ఈమూవీ ఓవర్సీస్ బయ్యర్ కష్టాలు అన్నీఇన్నీ కావు అని అంటున్నారు.  ఈసినిమాకు సంబంధించి ఓవర్సీస్ బయ్యర్ నష్టాలు లేకుండా బయటపడాలి అంటే ఈసినిమాకు ఓవర్సీస్ లో 3.5-4 మిలియన్ల వరకు వసూలు చేయాలి. కానీ ఈసినిమా ఇప్పటిదాకా 1.6 మిలియన్ డాలర్లే రాబట్టింది. తీనితో ఫుల్ రన్లో మహా అయితే 2.5 మిలియన్ మార్కును అందుకోవచ్చు అని అంటున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమా వల్ల ఓవర్సీస్ బయ్యర్ కి సుమారు 4 కోట్లకు పైనే  నష్టం వస్తుంది అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ పరిస్థుతులలో మహేష్ జనం మధ్యకు వెళ్లి ధియేటర్లలో కాలర్ ఎగర వేస్తూ త్వరలో విజవాడలో జరగబోయే ‘మహర్షి’ సక్సస్ మీట్ లో కలుసు కుందాం అని అనడం దేనికి సంకేతం అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ‘మహర్షి’ కంటెంట్ లో విజయవంతం అయినందుకా లేకుంటే కలక్షన్స్ లో రికార్డులను సృష్టిస్తున్నందుకా దేనికి సక్సస్ మీట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: