'నీతోడు కావాలి' సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటరైన హీరోయిన్ ఛార్మీ.. మంత్ర, అనుకోకుండా ఒక రోజు, రాఖీ, మాస్, పౌర్ణమి, లక్ష్మీ, వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే గత కొంతకాలంగా యాక్టింగ్ కి దూరంగా ఉంటూ నిర్మాతగా ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకుంటున్న సంగతి తెలిసిందే. . పూరి జగన్నాధ్ తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ఛార్మీ కూడా ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.  అయితే ఛార్మీ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్‌గా హీరో రామ్ ఛార్మీ కి ఒక సూపర్బ్ గిఫ్ట్ ఇచ్చాడట. 


ఈ విషయం తెలుపుతూ.. ఛార్మీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేస్తూ "నా బర్త్ డే ముందుగా నాకో భారీ సర్ ప్రైజ్.  చాలా రాజుల నుండి నేను కావాలనుకుంటున్నది రామ్ పోతినేని బహుమతిగా ఇచ్చాడు.  ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నాకు ఏది ఇష్టమో అలోచించడం.  దాన్ని అవుట్ డోర్ షూట్ లొకేషన్ కు తీసుకొచ్చి ఇవ్వడం. అంతేకాకుండా నాపై రాసిన కొటేషన్ సూపర్బ్.. అంటూ 'నా ఇస్మార్ట్ శంకర్... థ్యాంక్ యూ' అంటూ ట్వీట్ చేసింది ఛార్మీ.


ఒక ఫోటోలో గిఫ్ట్ తో పాటు రామ్ తో కలిసి పోజిచ్చింది. మరో ఫోటోలో ఆ గిఫ్ట్, రామ్ రాసిన బర్త్ డే మెసేజ్ ఫోటోను కూడా ఛార్మీ షేర్ చేసింది. అందులో "హ్యాపీ బర్త్ డే బాస్ లేడీ.. ఒక బాస్ లేడీ తన వయసును లెక్కపెట్టదు.. అనుభవాన్ని మాత్రమే లెక్క పెడుతుంది" మెసేజ్ ఉంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ  రామ్ ఇచ్చిన గిఫ్టేంటో, 
ఆ బాక్స్‌లో ఏముందో చెప్పలేదు ఛార్మీ.



మరింత సమాచారం తెలుసుకోండి: