ప్రశాంత్ కుమార్ డైరక్షన్ లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన సినిమా మిఠాయి. పోస్టర్, టీజర్ లో ఇంట్రెస్ట్ కలిగించిన ఈ సినిమా ఆడియెన్స్ ను మాత్రం మెప్పించలేకపోయింది. అయితే పోయిన సినిమా గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్థావన అనుకోవచ్చు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈమధ్యనే ఆ సినిమాను అమేజాన్ ప్రైం వాళ్లు తీసుకుని రిలీజ్ చేశారు.  


అది చూసిన డైరక్టర్ ప్రశాంత్ సినిమా ఇలా అవ్వడానికి కారణం అందులో నటించిన రాహుల్ రామకృష్ణ అని సంచలన పోస్ట్ పెట్టాడు. రాహుల్ రామకృష్ణతో స్నేహం ఈ సినిమా తీయాలనే ఆలోచన వచ్చేలా చేసింది కాని అతను నా పాలిట విలన్ గా మారి ఈ సినిమాను చెడగొట్టాడని అన్నారు ప్రశాంత్.


రాహుల్ ను టార్గెట్ చేస్తూ రాహుల్ రామకృష్ణతో చేదు మిఠాయి అంటూ ఓ పోస్ట్ పెట్టారు ప్రశాంత్. ప్రాజెక్ట్ డిస్ట్రబ్ అవ్వడానికి ఓ కారణం రాహుల్ అని.. రాహుల్ మంచి నటుడే అయినా తన జీవితంలో ఎదురైన అత్యంత చెత్త మనిషి రాహుల్ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి డైరక్టర్ ప్రశాంత్ ఎంత ఇబ్బంది పడి ఉంటే రాహుల్ మీద ఇలాటి కామెంట్స్ చేస్తారో అని కొందరు భావిస్తున్నారు.


ప్రశాంత్ చేసిన ఈ కామెంట్స్ కు రాహుల్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నది ఇక్కడ హాట్ న్యూస్ గా మారింది. అర్జున్ రెడ్డి సినిమాలో కమెడియన్ గా చేసి మంచి మార్కులు కొట్టేసిన రాహుల్ తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు రాహుల్ ను విలన్ అని సంభోదిస్తూ డైరక్టర్ ప్రశాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎందాకా వెళ్తాయో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: