మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయదశమి సందర్భంగా విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందే సైరా థియోటర్లలోకి రాబోతోందని లేటెస్ట్ అప్డేట్.


ఇక రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాను అక్టోబర్ 2 న రిలీజ్ చేసేందుకు 'సైరా' టీమ్ ప్లాన్ చేస్తున్నారట. 'సైరా' టీమ్ ఈ సినిమాకోసం సోలో రిలీజ్ డేట్ కోసం చూస్తోందట.  అందుకే అక్టోబర్ 2 ను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఫ్రీడం ఫైట్.. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 కంటే ఇం కో బెటర్ డేట్ ఉండదని భావిస్తున్నారట.

ఇక ఈ ఏడాది అక్టోబర్ 8 న విజయదశమి కాబట్టి ఆ పండగకు ముందు రిలీజ్ చేస్తే అన్ని విధాల సేఫ్ అని ఈ డేట్ ను ఫిక్సైయ్యారట. దాదాపు 10 రోజులు హాలీడేస్ రావడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి దానికి తగ్గట్టుగా భారీ వసూళ్ళు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: