కొంత మంది హీరో, హీరోయిన్లకు సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరుగుతుంది. టాలీవుడ్ బొద్దుగుమ్మ ఛార్మీ సినీ రంగ ప్రవేశం కూడా అలాంటిదే..ముంబాయిలో కాకతాళీయంగా ఛార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీతోడు కావాలి తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేసాడు.   అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ మూవీలో నటించింది.


కృష్ణ వంశీ  దర్శకత్వంలో నితిన్ నటించిన  శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మీ చాలా గ్లామర్ పాత్రలో నటించడంతో ఆమెకు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది. 


తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఛార్మీ మాట్లాడుతూ...చిన్న తనంలోనే నేను సినిమాల్లోకి వచ్చాను .. అన్ని భాషల్లోను కలుపుకుని ఇంతవరకూ 55 సినిమాల్లో నటించాను. కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు చూశాను. కథానాయికగా నేను కొనసాగించిన నా కెరియర్ పట్ల సంతృప్తిగానే వున్నాను.  


ఇప్పటికీ నాకు ఎన్నో సినిమా ఛాన్సులు వస్తున్నాయి..కానీ నేను వాటిని తిరస్కరిస్తూ వస్తున్నాను..ప్రస్తుతం నా దృష్టి నిర్మాణ రంగంపైనే ఉంది.  ప్రస్తుతం మా నుంచి రానున్న 'ఇస్మార్ట్ శంకర్' ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఆకాశ్ పూరితో మూవీ త్వరలోనే ఉంటుంది" అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: