ఆడవాళ్ళు రహస్యాలు రెండూ చాలా ఇష్టమైనవే. ఇంటెరెస్టింగ్ గా ఉండేవే. అందులోనూ అందమైన అమ్మాయి తీరిగ్గా సీక్రెట్స్ చెబుతానంటే ఎవరికైనా ఆరాటం ఎక్కువగానే ఉంటుంది. ఏం చెబుతుందోనని తెగ టెన్షన్ పడతారు. ఆ సీక్రెట్స్ చెప్పే బ్యూటీ అలాంటి ఇలాంటిది కాకపోతే ఇక కిర్రాకే మరి.


తెలుగుతెరపై సూపర్ అంటూ వచ్చిన అనుష్క శెట్టి ఇక్కడే 12 ఏళ్ళ నుంచి టాప్ స్టార్ గా ఉంది. ఆమె టాలెంట్ ఏంటి అని చెప్పడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆమె అందం అభినయం చెప్పడానికి బాహుబలి ఒక్కటి చాలు. అనుష్క ఇపుడు మళ్ళీ ముఖానికి రంగు వేసుకుని నటించేందుకు రెడీ అవుతోంది. మధ్యలో ఆమె గెస్ట్ రోల్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీలో నాలుగు నిమిషాల నిడివి గల ఇంపార్టంట్ పాత్రలో నటిస్తుందని కూడా న్యూస్ వస్తోంది.


ఇవన్నీ పక్కన పెడితే అనుష్క యోగా ట్రైనర్ అన్న సంగతి అందరికీ తెలియదు. ఆమె మూవీస్ లోకి రాకముందు యోగా  ట్రైనర్ గా కూడా పనిచేశారు. అనుష్క ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే లావుగా ఉన్నవారు ఎవరైన ఇట్టే సన్నం అయిపోవచ్చు. వెయిట్ లాస్ గురించి అనుష్క ఎన్నో విషయాలు నేర్చుకుంది. వాటిని చెప్పాలనుకుంటోంది. 


అందరూ ఆమెను అడుగుతున్నారట ఆ సీక్రేట్స్ చెప్పమని, ఇలా ఒకరిద్దరికీ ఎందుకు అందరికీ చెబుతామనుకుంటోందట. అందుకే  వెయిట్ లాస్ పై అనుష్క ఓ బూక్ రాయబోతోందట. తొందరలోనే ఆ బూక్ జనాలకు అందుబాటులోకి వస్తుంది. స్వీటీ చెప్పే సీక్రేట్స్ కూడా ఆ విధంగా అందరికీ తెలుస్తాయన్న మాట. అదీ మ్యాటర్.


మరింత సమాచారం తెలుసుకోండి: