రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు అనుష్క జంటగా నటించిన బాహుబలి సినిమా ఇద్దరి కెరియర్లో ఒక మైలు రాయి సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి జంటగా నటించిన బాహుబలి మినహా చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయాలు సాధించిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇండస్ట్రీలో ఉన్న హిట్ జంటలలో ప్రముఖ జంట అని ప్రభాస్ అనుష్క గురించి కామెంట్ చేస్తుంటారు ఇండస్ట్రీకి చెందినవారు.

Image result for prabhas anushka rajamouli

బాహుబలి సిరీస్ తర్వాత ఇప్పటిదాకా మళ్లీ వీరిద్దరూ కలిసి నటించలేదు. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి ఇద్దరు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మూవీ కి వర్క్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. అసలు విషయంలోకి వెళితే రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR రూపొందుతున్న విషయం తెలిసిందే.

Image result for prabhas anushka

భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించడం తో అభిమానులకు ఈ మూవీ పై ఆసక్తి పెరిగింది . అయితే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కి హీరో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అనుష్క 3లేదా 4 నిమిషాల పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో ప్రభాస్, అనుష్క కలసి రాజమౌళి రుణం తీర్చుకుంటున్నారు అనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: