పాయల్ రాజ్ పుత్... ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది.  మొదటి సినిమాలోనే బోల్డ్ లుక్స్ తో బోలెడంత పేరు తెచ్చుకుంది.  సినిమా మౌత్ టాక్ తో హిట్ కొట్టడంతో పాయల్ కు ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయని అంతా భావించారు.  కుర్ర హీరోలతో అవకాశలు వస్తాయని ఎదురు చూసింది బోల్డ్ సుందరి.  


కానీ, పాపం ఒక్క అవకాశం కూడా రాలేదు.  అయినా ఏ మాత్రం అసంతృప్తి చెందకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ దర్శక నిర్మాతలకు దగ్గర కావాలని చూసింది.  ఎదురు చూపులు ఫలించాయి అయితే.. కుర్ర హీరోల పక్కన ఛాన్స్ వస్తుంది అనుకుంటే... ఈ హీరోయిన్ కు పెద్ద హీరోలతో చేసే అవకాశాలు వస్తున్నాయి.  


ప్రస్తుతం వెంకటేష్ హీరోగా చేస్తున్న వెంకిమామలో హీరోయిన్ గా చేస్తోంది.  దీంతో పాటు రవితేజ డిస్కోరాజాలోను అలాగే బాలకృష్ణ కెఎస్ రవికుమార్ సినిమాలోనూ హీరోయిన్ గా తీసుకున్నారు.  పాయల్ వయసు చిన్నదే అయినా... లుక్స్ పరంగా పెద్దగా ఉంటుంది అనే భావన రావడంతో ఆమెకు పెద్ద హీరోలతో నటించే ఛాన్స్ వస్తున్నది.  ఏదైతేనేం అవకాశాలు వస్తున్నాయి కదా.  చాలా కాలం చూసిన ఎదురు చూపులు ఫలించాయి కదా.  ఈ మూడు సినిమాలు హిట్టయితే... అంతకంటే కావాల్సింది ఏముంది.  పాయల్ కెరీర్ టర్న్ అయినట్టే కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: