వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్... తరువాత పెద్ద హీరోలతో ఛాన్స్ కొట్టేసింది.  స్టార్ హోదాను సంపాందించుకున్న ఈ అమ్మడు కొన్ని రోజులపాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అయింది.  ప్రస్తుతం కొత్త హీరోయిన్ల రాకతో కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి.  తమిళంలో ఎన్జీకే, తెలుగులో మన్మధుడు 2, హిందీలో అజయ్ దేవగణ్ తో చేస్తున్న దేదే ప్యార్ దే సినిమాలు చేతిలో ఉన్నాయి.  


బాలీవుడ్ మూవీ దేదే ప్యార్ దే సినిమా ఈరోజు రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో పాటు స్టోరీ పరంగా కూడా ఆసక్తి రేకెత్తించడంతో అంచనాలు పెరిగాయి.  ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ యాక్షన్ కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయం అని అంటున్నారు. రకుల్ గ్లామర్ తో పాటు ఆమె నటన కూడా ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది.  


ఇందులో అజయ్ దేవగణ్ 50 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కనిపిస్తున్నారు.  ఆయన కూతురు వయసుండే అమ్మాయి రకుల్ తో ప్రేమలో పడతాడు.  ఈ లేటు వయసు ప్రేమ వలన ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్నది కథ.  కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది యూనిట్.  


ఒకవేళ సినిమా హిట్టయితే అందరికంటే ముందుగా సంతోషించేది వ్యక్తి రకుల్.  హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది.  ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది.  చిన్నదో పెద్దదో హిట్ వస్తే చాలు.. దాన్ని పట్టుకొని కాలర్ ఎగరేసి అవకాశాలు తెచ్చుకోవచ్చని రకుల్ అభిప్రాయం.  మరి బాలీవుడ్ ప్రేక్షకులు ఏమంటారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: