ఎన్టీఆర్ బ‌యోపిక్ పరాభావం నుండి బయటపడటానికి బాలకృష్ణ బోయపాటి మూవీతో బదులు చెపుతాడు అని అందరు భావించారు. అయితే అనూహ్యంగా బాలయ్య బోయపాటిల మూవీ అటకెక్కి బాలయ్య కెఎస్ రవికుమార్ ల మూవీ రంగంలోకి రావడమే కాకుండా ఈసినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇలాంటి పరిస్థుతులలో అఖిల్ బోయపాటి వంక చూస్తున్నట్లు సమాచారం. 

గతంలో బోయపాటి అఖిల్ తో సినిమా చేయాలని ప్రయత్నించి అతడికి సరిపడే ఒక పవర్ ఫుల్ మాస్ కథను తమారు చేయడమే కాకుండా ఆసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడ పూర్తిగా రెడీ పెట్టాడు అంటూ వార్తలు వచ్చాయి. అఖిల్ బోయపాటిల మూవీ ప్రారంభం అవుతుంది అని అనుకుంటున్న సమయంలో బోయపాటి చరణ్ తో ‘వినయ విధేయ రామ’ తీసే బిజీలో అఖిల్ సినిమాను పక్కకు పెట్టినట్లు టాక్. 

అయితే ఇప్పుడు బోయపాటి బాలయ్యల మూవీ పక్కకు జరగడంతో అఖిల్ తో గతంలో బోయపాటి తీస్తాను అని ఆసక్తిపరిచిన ఆ కథను బోయపాటి చేత సినిమాగా తీయించే విధంగా ఒక ప్రముఖ నిర్మాత రాయబారాలు చేస్తున్నట్లు టాక్. ఈ సూచనకు బోయపాటి అంగీకరిస్తే15కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికి నిర్మాత‌లు ముందుకొచ్చారు అన్న లీకులు వినిపిస్తున్నాయి. 

అయితే ఈ ఆఫర్ కు బోయపాటి ఏమాత్రం ఆసక్తి కనపరచకుండా తాను ప్రస్తుతం బాలకృష్ణ సినిమా కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉన్నానని కాస్త ఆలస్యం అయినా తన తదుపరి సినిమా బాలయ్యతో మాత్రమే ఉంటుందనీ సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు టాక్. అయితే ఇది అంతా బోయ‌పాటికి మార్కెట్ పడిపోలేదు అని వస్తున్న వ్యూహాత్మక లీకులా లేకుంటే నిజంగానే బాలయ్య కోసం బోయపాటి ఈ త్యాగం చేసాడా అనే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: