తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది. అయారీ సినిమాలో నటించిన రకుల్ లేటెస్ట్ గా అజయ్ దేవగన్ హీరోగా నటించిన దే దే ప్యార్ దే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాలో రకుల్ అందాల ఆరబోత బాగానే చేసింది.


తెలుగులో ఈ రేంజ్ లో అమ్మడు ఎక్స్ పోజింగ్ చేసింది లేదు. ఎంతైనా బాలీవుడ్ లో క్లిక్ అయితే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది అందుకే అక్కడకు వెళ్లే సరికి హీరోయిన్స్ అందాల గేట్లు ఎత్తేస్తారు. ఇక రకుల్ అయితే ఈ సినిమాలో మందు బాటిల్ చేతిలో పట్టుకుని తాగుతూ ఊగుతూ నానా హంగామా చేస్తుంది.


సెన్సార్ టీం ఆ సాంగ్ లో ఆమె చేసిన అతికి కత్తెర వేసినట్టు తెలుస్తుంది. చేతిలో మందు బాటిల్ బదులుగా పూల కుండి పెట్టబెట్టారట. అయితే మందు తాగితే వచ్చే కిక్ తో పోల్చుకుంటే పూల కుండి ఎంత వాసన చూసినా వస్తుందా.. ఈరోజు రిలీజ్ అవుతున్న దే దే ప్యార్ దే సినిమాపై రకుల్ చాలా హోప్స్ పెట్టుకుంది.


తెలుగులో ప్రస్తుతం మన్మథుడు 2, వెంకీమామ సినిమాల్లో నటిస్తున్న రకుల్ బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది. అజయ్ దేవగన్ సినిమా హిట్ కొడితే అమ్మడు అక్కడ వరుస అవకాశాలు అందుకోవడం ఖాయం. మరి దే దే ప్యార్ దే రకుల్ ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది ఈరోజు సాయంత్రం కల్లా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: