అందం ఒక్క ఆడాళ్ల సొత్తే కాదు.. అలాగే అందం కోసం గంగవెర్రులెత్తడం ఒక్క మగాళ్ల లక్షణమే కాదు.. టాప్ టెన్ అందగత్తల్లాగే.. మోస్ట్ డిజైరబుల్ మగాళ్లు కూడా ఉంటారు. దేశంలోని ఇలాంటి 2018 మోస్ట్ డిజైరబుల్ మగాళ్లు ఎవరనే అంశంపై ప్రముఖ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించింది. 


ఈ సర్వేలో రాజి, ఉరి వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు విక్కీకౌశల్ టాప్ ప్లేస్ సంపాదించాడు. గత ఏడాది ఈ కుర్రాడు అసలు లిస్టులోనే లేకపోవడం విశేషం. సెకండ్ ప్లేస్‌ లో ప్రాథమేశ్ మౌలింకర్ సంపాదించాడు. గతేడాది ఈ కుర్రాడు పదో స్థానంలో ఉన్నాడు. 

మూడో ప్లేస్‌లో నటుడు రన్నీర్ సింగ్ ఉన్నాడు. రన్వీర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసి మోస్ట్ డిజైరబుల్ మెన్ 2017 హోదా పొందాడు. ఇప్పుడు మూడో ప్లేసుకు వచ్చాడు. ఇక మన హైదరాబాదీ సంచలనం దేశంలోనే నాలుగో స్థానం పొంది పరువు నిలిపాడు. 

ఇక మిగిలిన వారిలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్ లాస్ట్ ఇయర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఆరో ప్లేసు విద్యుత్ జమ్మాల్, ఏడో స్థానం కార్తీక్ రోషన్, ఎనిమిదో స్థానంలో కార్తిక్ ఆర్యన్, తొమ్మిదో స్థానంలో దుల్కర్ సల్మాన్, పదో స్థానంలో సిద్ధార్ధ్ మల్రోత్రా ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: