మే నెల వచ్చింది అంటే చాలు నందమూరి అభిమానులకు పండుగ జోష్ ను ఇస్తూనే ఉంటుంది. విశ్వవిఖ్యాతనటసార్వభౌముడుగా చరిత్ర సృష్టించిన నందమూరి తారకరామారావు పుట్టినరోజు మే 28 అయితే ఆతాతకు తగ్గ మనవడుగా ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20. 

తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నుండి ప్రతి సంవత్సరం ‘మహానాడు’ ను ఘనంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగింది. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు వచ్చిన 5 రోజులలో ఎన్టీఆర్ పుట్టినరోజు వస్తున్న సందర్భంలో ఎన్నికల ఫలితాలలో ఎదో తేడాలు వస్తాయి అన్న అనుమానంతో ఈసారి తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ ను నిర్వహించడం లేదు.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడ ఈ సంవత్సరం తాను పుట్టినరోజు చేసుకోవడం లేదనీ అందువల్ల తన పుట్టినరోజు పేరుతో ఎటువంటి సంబరాలు హంగామా చేయవద్దు అంటూ జూనియర్ ప్రకటన ఇచ్చాడు. దీనికి కారణం గత సంవత్సరం ఆగష్టులో జూనియర్ తండ్రి హరికృష్ణ చనిపోయి ఒక సంవత్సరం కూడ అవ్వకపోవడం. 
దీనితో జూనియర్ పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుపుకోవాలి అని భావించిన జూనియర్ అభిమానుల ఉత్సాహం పై నీళ్ళు జల్లినట్లు అయింది.

ఈ సంవత్సరం జూనియర్ నటించిన ఒక్క సినిమా కూడ విడుదల లేకపోయినా ఈ పుట్టినరోజు వేడుకల హంగామాతో అభిమానులు తమదైన స్థాయిలో సందడి చేయాలి అని అనుకున్నారు. ఇలా తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం క్యాడర్ బయటకు చెప్పుకోలేని నిరాశలో ఉంటే జూనియర్ అభిమానులు తమ హీరో పుట్టినరోజును కూడ ఆనందంగా జరుపుకోలేని విచిత్రమైన పరిస్థుతులలో ఉండడం యాదృశ్చికం అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: