అంజ‌లి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని హీరోయిన్. జ‌ర్నీ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు చిత్రంతో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. ఆ త‌రువాత ఎన్నో చిత్రాల్లో న‌టించిన అంత‌గా క్లిక్ అవ్వ‌లేక‌పోయింది. ఈ భామ ఎక్కువ‌గా హార‌ర్ చిత్రాల‌పై మ‌క్కువ ఎక్కువ చూపిస్తుంది. గ‌తంలో శ్రీ‌నివాస్‌రెడ్డితో క‌లిసి న‌టించిన గీతాంజ‌లి కూడా అదే కోవ‌కు చెందింది. ఆ త‌రువాత మ‌సాలా అన్న చిత్రంలో న‌టించింది. అది కూడా ఓమాదిరిగా ఆడింది.


అయితే గత కొన్నాళ్లుగా తెలుగులో వెనుకబడిపోయిన కథానాయిక అంజలి ప్రధాన పాత్ర పోషించిన అనువాద చిత్రం 'లిసా' ఈ నెల 24న తెలుగులో విడుదలవుతోంది. హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్ లో నిర్మించడం విశేషం. ఈ చిత్రం తనకు తెలుగులో మళ్లీ ఆఫర్లు తెచ్చిపెడుతుందని అంజలి ఆశలు పెట్టుకుంది.


ఈమె హీరోయిన్‌గానే కాకుండా కొన్ని ఐటెమ్‌సాంగ్స్‌లో కూడా న‌టించింది. అయితే ఎందుకోగాని తెలుగులో మాత్రం ఆశించినంత‌గా హిట్ కాలేక‌పోయింది. మ‌రి ఈ చిత్రంతోనైనా ఈ భామ తిరిగి తెలుగులో అవ‌కాశాలు ద‌క్కించుకోవాల‌ని ఆశిద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: