క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ టాప్ హీరోలలో చాలామందితో సినిమాలు చేసాడు. ఒకప్పుడు టాలీవుడ్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుగాంచిన ఇతడు ప్రస్తుతం పరాజయాలతో సతమతమైపోతున్నాడు. 2009లో వచ్చిన ‘మహాత్మ’ తరువాత ఒక్క సినిమా కూడ ఈ దర్శకుడుకి హిట్ ను ఇవ్వలేకపోయాయి.

ఒకప్పుడు జూనియర్ తో ‘రాఖీ’ లాంటి పవర్ ఫుల్ మూవీని తీసిన ఈదర్శకుడు ఇప్పుడు హీరోల చుట్టూ తన స్క్రిప్ట్ పుచ్చుకుని తిరగవలసిన పరిస్థుతులు ఏర్పడాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈ దర్శకుడు ట్విటర్ లో తన అభిమానులతో ఛాట్ చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనేక ప్రశ్నల పై ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

తాను ప్రభాస్ తో తీసిన ‘చక్రం’ మూవీ గురించి మాట్లాడుతూ ఈసినిమాను ఇప్పటికీ బుల్లితెర పై ప్రేక్షకులు చూస్తున్నారని బుల్లితెర పై ప్రేక్షకులకు నచ్చిన ఈసినిమా ధియేటర్లలోని ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో తనకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో ఒక జూనియర్ అభిమాని కృష్ణ వంశీని అడిగిన ప్రశ్నకు అతడు ఊహించని సమాధానం ఇచ్చాడు.

ఎన్టీఆర్ తో ఒక మంచి రొమాంటిక్ సినిమాను తీయ్యండి అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ జూనియర్ అభిమానులు కోరుకున్నట్లుగా అతడిని హీరోగా చేసి సినిమాలు తీయగల యువ దర్శకులు చాలామంది ఉన్న పరిస్థుతులలో తనకు ఎవరు అవకాసం ఇస్తారు అంటూ తన పై తానే కామెంట్స్ చేసుకున్నాడు. అంతేకాదు తన తదుపరి సినిమా ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అన్న విషయం పై క్లారిటీ ఇవ్వలేకపోయినా ఎదో ఒకరోజు తన వైపు నుండి ఒక మంచి సినిమాను తీసి తిరిగి తాను ట్రాక్ లోకి వస్తాననే నమ్మకం తనకు ఉంది అంటూ కృష్ణ వంశీ చేసిన కామెంట్స్ అతడి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం..  



మరింత సమాచారం తెలుసుకోండి: