అల్లు వార‌సుడు అల్లు శిరీష్ గ‌తేడాది చేసిన ఒక్క క్ష‌ణం త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌ళ‌యాళ రీమేక్ సినిమా ఏబీసీడీలో న‌టించాడు. అదే టైటిల్‌తో వ‌చ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాతో అయినా శిరీష్ హిట్ కొట్టాడా ?  ఏబీసీడీ శిరీష్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిందా ?  అన్న‌ది చూద్దాం.


అమెరికాలో ఎలాంటి బాధ్య‌త‌లు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేసే అవి (శిరీష్‌)ను తండ్రి నాగ‌బాబు ఇండియాకు వెళ్లి ఏంబీఏ చ‌ద‌వ‌మ‌ని పంపుతాడు. అవితో పాటు భాషా (భ‌ర‌త్‌) ఇండియాకు వ‌స్తారు. అక్క‌డ వారికి లోక‌ల్ పొలిటిక‌ల్ లీడ‌ర్ కొడుకు నుంచి తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర‌వుతాయి... వాటిని ఎదుర్కొని అక్క‌డ మంచి వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్న అవికు నేహ (రుక్సార్ థిల్లాన్‌)తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారుతుంది. ఈ జ‌ర్నీలో అవి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? అవి ఎలా ముగిశాయి అన్న‌దే స్టోరీ.


సినిమాలో న‌టించిన ప్ర‌తి ఒక్కరు తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఫ‌స్టాఫ్‌లో కామెడీ నెరేష‌న్‌తో ప‌ర్వాలేదనిపించిన ఏబీసీడీ సెకండాఫ్‌లో మాత్రం స్లో నెరేష‌న్‌తో పాటు అర్థం ప‌ర్థం లేని క‌థ‌నం, గంద‌ర‌గోళ‌మైన మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుడిని విసిగించింది. ద‌ర్శ‌కుడు సంజీవ్‌రెడ్డి పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో కాస్త ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్నే ఎంచుకున్నా సెకండాఫ్‌లో చాలా చోట్ల ముందు వ‌చ్చే సీన్ల‌ను ప్రేక్ష‌కుడు ముందే ఊహించేస్తాడు. ఏదేమైనా ఏబీసీడీ శిరీష్ కెరీర్‌ను మ‌లుపు తిప్పేంత గొప్ప‌గా లేదు. ప్ర‌స్తుతానికి యావ‌రేజ్ టాక్ ఉన్నా సాయంత్రానికి సినిమా పూర్తి టాక్‌తో ఈ సినిమా స‌త్తా ఏంటో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: